కాంగ్రెస్‌ , టీఆర్‌ఎస్‌ లో ‘లోకల్’ రెబల్స్

కాంగ్రెస్‌ , టీఆర్‌ఎస్‌ లో ‘లోకల్’ రెబల్స్

హైదరాబాద్, వెలుగు: లోకల్‌ బాడీ ఎన్నికల్లో టీఆర్‌ ఎస్‌ , కాంగ్రెస్‌ కు రెబల్స్‌‌ దడ పుట్టిస్తున్నారు. ఒక్కోస్థానానికి ముగ్గురు నుంచి ఐదుగురు నామినేషన్లు వేయడంతో వారిని పోటీ నుంచి తప్పించేందుకు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నా రు. మొదటి విడతలోనే రెబల్స్ బెడద ఈ స్థాయిలో ఉంటే మరో రెండు దశల్లో జరిగే పరిషత్‌ ఎన్నికల్లో ఇంకెలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నా రు. ఈ నెల22న లోకల్ బాడీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా 24తో ముగిసింది. ఉపసంహరణకు ఈ నెల 28 వరకు గడువుంది. ఆలోపు రెబల్స్‌‌ను తప్పించడం నేతలకు పరీక్షగా మారింది.

కారు బేజారు..

టీఆర్‌ ఎస్‌ లో అన్ని మండలాల్లో రెబల్స్‌‌ బరిలో ఉండడం ఎమ్మెల్యేలకు సమస్యగా మారింది. అభ్యర్థుల ఎంపిక, బీఫారాల పంపిణీ, వారిని గెలిపించుకునే బాధ్యతను ఎమ్మెల్యేలకే అప్పగించారు. దీంతో తమ సెగ్మెంట్‌ లో ఒక్క జడ్పీటీసీ స్థానం కోల్పో యినా,ఎంపీపీ సీటులో ఇతర పార్టీ పాగా వేసినా అధినేత ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న ఆందోళనలో వారున్నారు. ఎంత బుజ్జగించినా కొందరు రెబల్స్ బరి నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటుండడంతో ఆయా జిల్లా ల మంత్రులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో రెబల్స్‌‌ను పోటీ నుంచి తప్పించే విషయంలో ఏకంగా కేటీఆర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఇక్కడ మాజీ మంత్రి తుమ్మల వర్గానికి చెందిన సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు రామసహాయం నరేష్ రెడ్డికి  జడ్పీటీసీ టికెట్ ఇవ్వకుండా,కాంగ్రెస్ నుంచి చేరిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గానికి చెందిన క్రాంతి కుమార్ కు టికెట్ఇచ్చారు. దీంతో నరేష్ రెడ్డి, ఆయన అనుచరులు మొత్తం 107 మంది నామినేషన్లు వేశారు. రాష్ట్రంలో అత్యధిక నామినేషన్లు దాఖలైన జడ్పీటీసీ ఇదే. ఇది ఖమ్మం జిల్లా అధికార పార్టీ నేతలను కలవరపరిచింది. వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో కేటీఆర్ రంగంలోకి దిగినట్లు సమాచారం.

ఇది ఒక్కటే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అనేక జడ్పీటీసీ సీట్లలో అధికార పార్టీకి ఇదే పరిస్థితి ఉంది. మేడ్చల్ జడ్పీటీసీకి టీఆర్ఎస్ అభ్యర్థిగా శైలాజారెడ్డి బరిలో నిలువగా.. రెబల్ గా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ భార్య అనితా యాదవ్ నామినేషన్ వేశారు. కీసర జడ్పీటీసీ అభ్యర్థి గా వెంకటేష్ ను టీఆర్ఎస్ బరిలో నిలుపగా.. అక్కడి సర్పం చ్ భర్త వెంకటేష్ ముదిరాజ్ రెబల్‌ గా బరిలో నిలిచారు.

కాంగ్రెస్‌‌లో ఇలా..

కాంగ్రెస్ కూడా రెబల్స్ సమస్యతో సతమతమవుతోంది. రంగారెడ్డి, నల్గొం డ, మహబూబ్ నగర్,కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో పలుమండలాల నుంచి జడ్పీటీసీ కి రెబల్స్ బరిలో నిలిచారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు సీనియర్లు బరిలో నిలిచారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం కోడలు సరిత, మరో సీనియర్ నేత నర్మల తిరుపతి గౌడ్‌ భార్య కూడా నామినేషన్లు వేశారు.ఇద్దరిలో ఎవరిని బరిలో నిలుపాలి, ఎవరిని పోటీనుంచి తప్పిం చాలన్నది జిల్లా నేతలకు సమస్యగా మారింది. కరీంనగర్ జిల్లా లో జమ్మికుంట,మానకొండూర్, వీణవంక, హుజురాబాద్ జడ్పీటీసీ సీట్లకు కాంగ్రెస్ నుంచి ముగ్గురేసి చొప్పున బరిలో నిలిచారు.

చాలా మండలాల్లో కాంగ్రెస్ కు ఈ బెడద కన్పి స్తోంది. వీరిని బరిలో నుంచి తప్పించేందుకు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ ఛార్జిలు,డీసీసీ అధ్యక్షులు, ఎంపీ అభ్యర్థులు బుజ్జగింపులకు దిగారు. కొన్నిచోట్ల రెబల్స్ మొండికేస్తుండడంతో  పీసీసీ నేతలు ఫోన్లు చేసి బుజ్జగిస్తున్నారు. ఎంపీటీసీ సీట్లలోనూ ఇదే పరిస్థితి ఉంది.