- కంగ్రాట్స్ తెలిపిన అడిషనల్ కలెక్టర్, డీఈఓ
ఖమ్మం టౌన్, వెలుగు : స్థానిక త్రివేణి స్కూల్ స్టూడెంట్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభను ప్రదర్శించి జాతీయస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్కు ఎంపికయ్యారు. హైదరాబాద్ నగరంలోని బేగంపేట లో ఉన్న సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో పోటీలు జరిగాయి. ఈపోటీలలో త్రివేణి స్కూల్ కు చెందిన టీ.డార్విన్, బాలాజీ, కె.అఖిల్ రెడ్డి, గైడ్ టీచర్ కె.రోశయ్య ఆధ్వర్యంలో సొల్యూషన్ టు ది కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ బై ద గ్రానైట్ ఎగ్జాస్టర్స్ అనే అంశంపై ప్రదర్శించిన ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపిక అయ్యింది.
దీంతో జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ,ఏఎంఓ రవికుమార్, డీసీఈబీ సెక్రటరీ నారాయణ, డీఎస్ఓ జగదీశ్వర్, ఎన్ సీఎస్ సీ డిస్టిక్ కోఆర్డినేటర్ ఈ వెంకటేశ్వర్లు, అధికారులు బుధవారం విద్యార్థులను అభినందించారు. త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి విద్యార్థుల విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్, సీఆర్ ఓ కాట్రగడ్డ మురళీకృష్ణ, వైస్ ప్రిన్సిపల్ స్వప్న, ముస్తఫా,అశోక్, క్యాంపస్ ఇన్చార్జి చార్లెస్ సందీప్, టీచర్లు పాల్గొన్నారు.