Viral Video: నువ్వు కేక బ్రో:సీపీఆర్ చేసి పామును బతికించాడు

Viral Video: నువ్వు కేక బ్రో:సీపీఆర్ చేసి పామును బతికించాడు

సీపీఆర్.. కార్డియోపల్మోనరీ రెససిటేషన్ (CPR)..ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపించే మాట.. చిన్నా పెద్దా, ముసలి, టీనేజర్లు అనే తేడా లేకుండా హార్ట్ అటాక్ లు పెరగుతున్న క్రమంలో.. సీపీఆర్ తో  ఎంతో మంది ప్రాణాలను రక్షించబడుతున్నాయి. అది మనందరికి తెలుసు. అయితే సీపీఆర్ మనుషులకేనా.. జంతువులు, పక్షులకు కూడానా ..అంటే జంతువులను కూడా సీపీఆర్ చేసి బతికించొచ్చని చాలా సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా గుజరాత్ లోని వడోదరలో కూడా సృహకోల్పోయిన పామును సీపీఆర్ చేసిన బతికించిన ఘటన చోటుచేసుకుంది. 

గుజరాత్లోని వడోదరలో పాముకు కార్డియోపల్మొనరీ రిససిటేషన్ (CPR) చేసి బతికించాడు ఓ వన్యప్రాణి సంరక్షకుడు. యష్ తద్వి అనే స్నేక్ రక్షకుడు ఒక అడుగు పొడువున్న చెక్కర్డ్ కీల్ బ్యాక్ కదలకుండా పడివుండటం చూసి సీపీఆర్ మొదలుపెట్టాడు. 

పామును జాగ్రత్తగా మెడదగ్గర పట్టుకొని దాని నోరు తెరచి గాలి ఊదడం ప్రారంభించాడు. అలా మూడు సార్లు CPR ప్రయత్నించాడు. మొదటి రెండు ప్రయత్నాల్లో ఫలితం లేకపోయినా..మూడో ప్రయత్నంలో పాము స్పృహలోకి వచ్చింది. నాటకీయంగా జరిగిన ఈ రెస్క్యూ ని కొందరు వీడియో క్యాప్చర్ చేశారు. మై వడోదర  అనే యూజర్ సోషల్  మీడియా ప్లాట్ ఫాం Xలో పోస్ట్ చేశాడు.

CPR చేయడం ద్వారా జంతువులను రక్షించడం అనేది ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు యూపీలోని బులంద్ షహర్ లో వికాస్ తోమర్ అనే హెడ్ కానిస్టేబుల్ ఓ కోతిని ఇలాగే రక్షిం చాడు. ప్రమాదవ శాత్తు కొమ్మ మీదనుంచి కిందపడిపోయి స్పృహ కోల్పోయింది. హెడ్ కానిస్టేబుల్ తోమర్ గమనించి తోటి పోలీసులతో కలిసి కోతికి సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. 

సెప్టెంబర్ 2024 లో ఊటాలో ఫైర్ సిబ్బంది మంటల్లో చిక్కుకున్న ఓ కుక్కను కాపాడారు. ఓ అపార్టుమెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో మంటల్లో చిక్కుకున్న కుక్కను బయటి తీశారు. అది అప్పటికే సృహతప్పిపడిపోయింది. అయితే సమర్థవంతంగా CPR నిర్వహించి కుక్కను కాపాడారు. 

వడోదరలో పాము అయినా, ఉటాలో కుక్క అయినా సరే..దయకు పరిమితుల్లేవని, ప్రతి ప్రాణం రక్షించబడేంత విలువైనదని చెబుతున్నాయి.