మోతీనగర్లో కరెంట్ అధికారులపై స్థానికుల దాడి

మోతీనగర్లో కరెంట్ అధికారులపై స్థానికుల దాడి

హైదరాబాద్: నగర పరిధిలోని మోతీనగర్ లో విద్యుత్ శాఖ లైన్ ఇన్స్పెక్టర్, మీటర్ రీడర్ పై స్థానికులు దాడి చేశారు. శుక్రవారం (జూలై 19) మోతీనగర్ లో పెండింగ్ బిల్లులు వసూలు చేసేందుకు లైన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, మీటర్ రీడర్ వెళ్లారు. పెండింగ్ కరెంట్ బిల్లులు చెల్లించాలని స్థానికులను కోరారు. 

కరెంట్ బిల్లు చెల్లించక పోతే విద్యుత్ సప్లయ్ నిలిపివేస్తామని చెప్పడం.. లైన్ ఇన్ స్పెక్టర్, మీటర్ కు స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. లైన్ ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్, మీటర్ రీడర్ సాయిపై స్థానికుడు రాములు, అతని కుమారుడు దాడి చేశారు.

 ఈ దాడిలో విద్యుత్ అధికారి శ్రీకాంత్ కు తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు సనత్ నగర్ పోలీస్ స్టేషన్లలో రాములు, అతని కుమారుడిపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.