ఖమ్మం జిల్లా బీకే నగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన హరీశ్ రావు కారుపై రాళ్ల దాడి చేశారు స్థానికులు. దాడి సమయంలో హరీశ్ వెంట మాజీ మంత్రులు సబిత, జగదీష్ రెడ్డి, పువ్వాడ, మాజీఎంపీ నామానాగేశ్వర్ రావు కారులోనే ఉన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ALSO READ : నీ దగ్గరికే అధికారులను పంపిస్తా..పువ్వాడ ఆక్రమణలు కూల్చెయ్.. హరీశ్ కు సీఎం రేవంత్ సవాల్..
వరద ప్రాంతాల్లో పర్యటించారు హరీశ్ రావు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ పాలనపై పట్టు కోల్పోయారని విమర్శించారు. వరదలు తగ్గి రెండు రోజులైనా బాధితులకు సాయం అందలేదన్నారు. రేవంత్ ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సాగర్ కెనాల్ తెగడానికి ప్రభుత్వ నిర్లక్షమేనన్నారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు హరీశ్