హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని స్థానికులు పట్టుకున్నారు. వారి సెల్ ఫోన్లలో గన్స్, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటోలు కనిపించాయి. దీంతో రాజాసింగ్ హత్యకు కుట్ర చేస్తున్నారా అనే అనుమానంతో స్థానికులు వారిద్దరినిమంగళ్ హాట్ పోలీసులకు అప్పగించారు . నిందితులను ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు పోలీసులు. రాజాసింగ్ ఇంటి దగ్గర తిరగడంపై వీరిని ప్రశ్నిస్తున్నారు. రాజాసింగ్ హత్యకు కుట్ర చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ALSO READ | హైడ్రా కూల్చివేతలపై MLA దానం సంచలన వ్యాఖ్యలు