కోల్‌బెల్ట్, వెలుగు: ఓపెన్‌కాస్ట్‌లో ఇష్టారాజ్యంగా జరుగుతున్న బ్లాస్టింగ్ లను ఆపాలని స్థానికులు ఆందోళన చేశారు. శుక్రవారం రామకృష్ణాపూర్‌లోని శాంతినగర్, ఆర్కే-4 గడ్డ కుటుంబాలను ఓసీపీ సింగరేణి ఆఫీసర్లు కలిశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కొద్ది రోజులుగా రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ బ్లాస్టింగ్‌తో తమ ఇండ్లపై మట్టిపెళ్లలు, బండరాళ్లు పడుతున్నాయన్నారు. ప్రతిరోజు ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకొని భయం భయంగా గడుపుతున్నామన్నారు.
ప్రభావిత కాలనీ ఆనుకొని ఉన్న ఓసీపీ ప్రాంతంలో బ్లాస్టింగ్లు నిలిపివేస్తామని ఓసీపీ పీవో గోవిందరావు, మేనేజర్ వెంకటేశ్వర్లు హామీ ఇచ్చారు. ఆఫీసర్ల వెంట టీబీజీకేఎస్, ఏఐటీయూసీ లీడర్లు పోశం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.