- హనుమకొండ పబ్లిక్ గార్డెన్ వద్ద ఘటన
- నిందితుడికి మతిస్థిమితం లేదన్న పోలీసులు
హనుమకొండ సిటీ, వెలుగు : హనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదుట ఆరేండ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు, పర్యాటకులు చితకబాది పోలీసులకు అప్పగించారు. పబ్లిక్ గార్డెన్ బయట పండ్లు అమ్ముకునే కుటుంబానికి చెందిన ఓ బాలిక సోమవారం మంచినీళ్లు తెచ్చుకునేందుకు దగ్గరల్లోని నల్లా దగ్గరకు వెళ్లింది. ఆ టైంలో అక్కడే ఉన్న భద్రాచలం పట్టణానికి చెందిన చిన్నేటి సతీశ్ అడ్డగించి కిడ్నాప్‌కు యత్నించాడు.
నోట్లో గుడ్డలు కుక్కి కొరకడంతో గమనించిన స్థానికులు, గార్డెన్‌కు వచ్చిన పర్యాటకులు..బాలికను విడిపించి సతీశ్‌ను చితకబాదారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. కొంత కాలంగా మతిస్థిమితం లేకపోవడంతో సతీశ్ అక్కడా ఇక్కడా తిరుగుతున్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.