
- హైరానా పడిన స్థానికులు
కాగ జ్ నగర్, వెలుగు: కుమ్రరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అర్ధరాత్రి ఎమర్జెన్సీ సైరన్ మోగడంతో స్థానికులు హైరానా పడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారంతో ఇవ్వడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాంకు మేనేజర్‌ను రప్పించి స్ట్రాంగ్ రూములను చెక్ చేశారు. లోపల ఎవరూ లేకపోవడం, చోరీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. టెక్నికల్ రీజన్ వల్ల సైరన్ మోగిందని ఎస్సై కొమురయ్య తెలిపారు.