మా డబ్బులు మాకివ్వాలె..బీజేపీ కార్యకర్త ఇంటిముందు బాధితుల ఆందోళన

మా డబ్బులు మాకివ్వాలె..బీజేపీ కార్యకర్త ఇంటిముందు బాధితుల ఆందోళన
  • అధిక వడ్డి ఆశచూపి కోటి వసూలు
  • నిజామాబాద్​ జిల్లాలో ఘటన

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యకర్త ఆకుల నీలిమ తమకు అధిక వడ్డీ ఆశచూపి కోటి రూపాయల వరకు వసూలు చేసిందని స్థానికులు ఆరోపించారు. ఆమె మాటలు నమ్మి పూసలగల్లీకి చెందిన సుమారు 30 మంది ఆమెకు డబ్బులిచ్చినట్లు చెప్పారు. తమ నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్​ చేస్తూ వారు నిందితురాలి ఇంటి ముందు బైఠాయించారు. తమకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.