అయోధ్య వరకు యువకుల సైకిల్​ యాత్ర

పిట్లం, వెలుగు : సైకిల్​పై అయోధ్యకు వెళుతున్న యువకులకు పిట్లంలో స్థానికులు  స్వాగతం పలికారు.   ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ 21 రోజుల్లో అయోధ్యకు చేరాలని బీదర్​ను నుంచి 11 మంది  బయలుదేరినట్లు తెలిపారు. అక్కడికి చేరుకుని ఐదు రోజులు అక్కడే ఉండి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటామని పేర్కొన్నారు. సైకిల్​పై వెళ్తున్న యువకులను  స్థానికులు అభినందించారు.