ఇందారంలో భూ సర్వేను అడ్డుకున్న స్థానికులు

ఇందారంలో భూ సర్వేను అడ్డుకున్న స్థానికులు

జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలోని ఇందారంలో భూ సర్వే చేస్తున్న అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. 1113 సర్వే నంబర్​లో హద్దులు గుర్తించేందుకు సర్వేయర్ రామస్వామి వచ్చి సర్వే చేస్తుండగా స్థానికులు అడ్డు పడ్డారు. ఎన్నో ఏండ్ల క్రితం ఇక్కడ ఇండ్లు నిర్మించుకుని జీవిస్తున్నామని, అయితే తమ ఇండ్ల భూమిని ముత్యంరావు వారసుడిగా చెప్పుకునే ఆనంద్ కృష్ణ అనే వ్యక్తి మోసపూరితంగా పట్టాలు చేసుకున్నాడని పేర్కొన్నారు. 

సర్వే పేరుతో గ్రామంలో పట్టా లేకుండా ఉన్న భూములను రెవెన్యు అధికారుల సహకారంతో పట్టాలు చేసుకుని స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ స్పందించి ఈ వ్యవహరంపై విచారణ జరిపి అక్రమంగా పట్టా చేసుకున్న వారిని, వారికి సహకరించి పట్టాలు చేసిన రెవెన్యు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమ ఆధీనంలో ఉన్న ఖాలీ స్థలాలను తమకు పట్టా చేశాకే సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. సర్వేయర్​కు వినతి పత్రం అందజేశారు.