పీహెచ్​సీ ఎదుట స్థానికుల ఆందోళన

పీహెచ్​సీ ఎదుట స్థానికుల ఆందోళన

పాల్వంచ రూరల్, వెలుగు: పాల్వంచ మండలం, ఉల్వనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తగిన సిబ్బందిని నియమించాలని మంగళవారం పీహెచ్​సీ ఎదుట స్థానికులు ఆందోళన చేశారు. కొన్ని నెలలుగా రక్త పరీక్షలు చేయడానికి ఎవరూ లేకపోవడంతో డెంగ్యూ, మలేరియా, టైపాయిడ్, చికెన్ గున్యా జ్వరాలు వచ్చినప్పుడు పాల్వంచ, కొత్తగూడెం, ఖమ్మం లాంటి పట్టణాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. 

ఉన్నతాధికారులు స్పందించి సిబ్బందిని నియమించాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో ఉల్వనూరు గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ బర్ల లక్ష్మణరావు, గ్రామస్తులు వెంకన్న, వీరస్వామి, రమేశ్, రాములు పాల్గొన్నారు.