రైతు దంపతులను కాపాడిన స్థానికులు

ఎడ్లబండితోపాటు వాగులో కొట్టుకుపోతున్న రైతు దంపతులను చుట్టుపక్కన పొలాల్లో ఉన్నవాళ్లు కాపాడారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఉదయం అగ్గు భూమన్న, లక్ష్మీ దంపతులు వాగు అవతల ఉన్న తమ పొలానికి వెళ్లారు. సాయంత్రం వస్తుండగా వాగు ఉధృతిలో చిక్కుకున్నారు. ఎడ్లబండితోపాటు వాగులో కొట్టుకుపోతూ కేకలు వేశారు. చుట్టుపక్కన పొలాల్లో ఉన్నవారు వెంటనే వాగులోకి దిగి ఎడ్ల బండితోపాటు రైతు దంపతులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.