Google Maps వినియోగదారులకోసం చాలా ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా మనం ప్రయాణం చేస్తున్నపుడు లొకేషన్ ను కనుగొనేందుకు ఒక్కోసారి ఇబ్బంది పడతాం.. అలాంటి సమయాల్లో Google Maps లైవ్ లొకేషన్ షేర్ చేయడం ద్వారా మనకు ఎంతో ఉపయోగపడుందని మనకు తెలుసు... కానీ కొంతమందికి గూగుల్ మ్యాప్ లో లొకేషన్ షేర్ చేయడం కొంత కష్టంగా ఉంటుంది.. అలాంటి వారు ఈ కింది విధంగా చేయడం ద్వారా Google Maps లో లైవ్ లొకేషన్ ను ఈజీగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్లకు షేర్ చేయొచ్చు. వారి ప్రయాణాన్ని సులభతరం చేయొచ్చు.
Google Maps ఉపయోగించి మొబైల్ లో లొకేషన్ షేర్ చేయండిలా..
- ముందుగా మీ డివైజ్ లో Google Maps యాప్ ఇన్ స్టాల్ చేయబడిందా లేదా నిర్ధారించుకోండి.
- యాప్ ని తెరిచి Google ఖాతాతో సైన్ ఇన్ చేయాలి
- మీ ఉన్న స్థానాన్ని సూచిస్తున్న మ్యాప్ లోని బ్లూ కలర్ బిందువుపై క్లిక్ చేయాలి . స్క్రీన్ దిగువన మెనూ వస్తుంది
- మెనూ నుంచి మీ డివైజ్ ను బట్టి లొకేషన్ షేర్ లేదా రియల్ టైం లొకేషన్ షేర్ చేయండి ఆప్షన్ పై ట్యాప్ చేయాలి
- మీరు లైవ్ లొకేషన్ ఎంత టైం షేర్ చేయాలనుకుంటున్నారో (ఉదా . 15 నిమిషాలు, గంట) ఆప్షన్లలో ఎంచుకోవాలి.
- తర్వాత ఎవరికి లైవ్ లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో వారిని Google కాంటాక్టుల నుంచి ఎంచుకోవాలి. లేదా ఈమెయిల్ అడ్రస్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు.
- కాంటాక్టు నెంబర్ ఎంచుకున్న తర్వాత Send లేదా Share బటన్ ను నొక్కాలి
- లైవ్ లొకేషన్ లింక్ మీరు ఎవరికైతే పంపించారో వారికి ఈమెయిల్ లేదా నోటిఫికేషన్ ద్వారా వెళ్తుంది.
- అవసరమైతే లొకేషన్ షేరింగ్ మెనూ కి వెళ్లి Stop Sharing ని నొక్కితే లొకేషన్ షేరింగ్ ను నిలిపి వేయొచ్చు.
డెస్క్ టాప్ ద్వారా లైవ్ లొకేషన్ షేర్ చేయండిలా..
- వెబ్ బ్రౌజర్ ను ఓపెన్ చేసి Google Maps లోకి వెళ్లాలి
- మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయాలి
- మీ ప్రస్తుత స్థానాన్ని సూచిస్తున్న బ్లూ రంగు బిందువుపై క్లిక్ చేయాలి
- ఒక చిన్న విండో ఓపెన్ అవుతుంది. అందలో Location Share It ను ఎంచుకోవాలి
- లైవ్ లొకేషన్ షేరింగ్ టైం ని సెలక్ట్ చేసుకోవాలి
- లైవ్ లొకేషన్ ఎవరికైతే పంపాలనుకుంటున్నారో వారి ఈ మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేయాలి
- మెనూ Share/ Send ఆప్షన్ పై క్లిక్ చేయాలి
- రీసీవర్లకు లింక్ తో ఉన్న ఈ-మెయిల్ వెళ్తుంది
- లైవ్ లొకేషన్ షేర్ చేయడాన్ని నిలిపి వేయాలంటే లొకేషన్ షేరింగ్ విండోలో Stop Sharing ఆప్షన్ ఎంచుకోవాలి.
ఈ విధంగా చేస్తే పూర్తి సెక్యూరిటీతో మీరు లైవ్ లొకేషన్ ను మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్లకు, ఇలా మీరు ఎవరికైతే లొకేషన్ షేర్ చేయాలనుకుంటున్నారో వారికి సురక్షితంగా పంపొచ్చు.