గూడూరులో బిల్లులు ఇవ్వాలని మహిళా సమాఖ్య బిల్డింగ్‌‌కు తాళం

గూడూరు, వెలుగు : మండల మహిళా సమాఖ్య బిల్డింగ్‌‌ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయడం లేదంటూ సమాఖ్య ఆఫీస్‌‌కు తాళం వేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌‌ జిల్లా గూడూరులో గురువారం జరిగింది. గూడూరు మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా గతంలో పనిచేసిన సుభద్ర మరికొందరితో కలిసి సుమారు పదేళ్ల కింద చంద్రుగూడెంలో సమాఖ్య బిల్డింగ్‌‌ నిర్మించారు. దీనికి సంబంధించి రూ. 6 లక్షల బిల్లు రావాల్సి ఉంది.

ఈ బిల్లులు మంజూరు చేయాలని ఏపీఎంతో పాటు, పైఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు డబ్బులు విడుదల చేయలేదు. దీంతో గురువారం మండల సమాఖ్య ఆఫీస్‌‌కు తాళం వేసి అక్కడే బైఠాయించింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్‌‌ అశోక్‌‌ అక్కడికి వచ్చి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో తాళం తీసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.