అప్పుడు పబ్‌‌.. ఇప్పుడు వైల్డ్‌‌లైఫ్‌‌ హాస్పిటల్‌‌

లాక్‌‌డౌన్‌‌లో మస్తు హోటళ్లు, పబ్‌‌లు క్లోజ్‌‌ అయినయ్‌‌. అందులో చాలావరకు తిరిగి తెరుచుకోలేదు. కానీ, నార్త్‌‌వెస్ట్‌‌ డబ్లిన్‌‌లోని కౌంటీ మీత్‌‌లో ఉన్న ‘తారా నా రి’ పబ్‌‌ మాత్రం వైల్డ్‌‌లైఫ్‌‌ రిహాబిలిటేషన్‌‌ ఐర్లాండ్‌‌(డబ్ల్యూఆర్‌‌‌‌ఐ)గా మారింది.  ఐర్లాండ్‌‌లో ఇదే మొదటి వైల్డ్‌‌లైఫ్‌‌ రిహాబిలిటేషన్‌‌ సెంటర్‌‌‌‌. ఒకప్పుడు పబ్‌‌కు వచ్చిన వాళ్లకు మందు, తిండి వండిపెట్టిన స్టాఫ్‌‌ ఇప్పుడు జంతువులకు ఫీడ్‌‌ చేస్తున్నారు. చిన్న గొర్రె పిల్లలకు బాటిల్‌‌తో పాలు పడుతూ కనిపిస్తున్నారు. దెబ్బలు తగిలిన నక్కలు మరికొన్ని జంతువులకు సేవ చేస్తున్నారు. “ చాలా రోజులుగా మేమంతా ఒకే జీవన విధానానికి అలవాటుపడ్డాం. అది కాకుండా కొత్త పని చేయాలంటే ఏదో శూన్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, మనకు సాధ్యం కావు అనుకున్న పనులను చేయాల్సి వస్తుంది. వాటిని సాధించేందుకు కొంత టైం పడుతుంది” అని పబ్‌‌ ఓనర్‌‌‌‌ జేమ్స్‌‌ మెక్‌‌కార్తి అన్నారు. ప్రస్తుతం అదే పబ్‌‌ ముందు ఆయన టేక్‌‌ అవే కాఫీలు ఇస్తున్నాడు. త్వరలోనే దీన్ని వైల్డ్‌‌లైఫ్‌‌ ఆర్ఫన్‌‌ హోంగా మారుస్తున్నారట.

ఇవి కూడా చదవండి 

రింగు డాన్స్‌‌తో గిన్నిస్ రికార్డ్

కారు యాక్సిడెంట్.. పోలీసులకు బంగారం అప్పగించిన 108 సిబ్బంది

ఏపీలో రూ.23,500.. తెలంగాణలో రూ.15 వేలే