
ఇటీవల ‘టిల్లు’ స్వ్కేర్’తో బిగ్ సక్సెస్‌ను అందుకున్న అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. అదికూడా వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. ఆమె లీడ్ రోల్‌లో నటించిన ‘లాక్ డౌన్’ మూవీ టీజర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు మేకర్స్. కరోనా సమయంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా లాక్‍డౌన్ విధించినట్టు టీవీలో న్యూస్ చూశాక తన తండ్రికి అనుపమ టెన్షన్‍గా ఫోన్ చేయడంతో టీజర్ మొదలైంది.
ఆ తర్వాత ఎవరి కోసమో వెతికేందుకు రోడ్లపై పరుగెత్తుతూ కనిపిస్తుంది అనుపమ. అదే సమయంలో అనిత అంటూ తనను ఓ మహిళ పిలుస్తుంది. తర్వాత ఆమెకు ఏమైంది.. తనకు ఏం జరిగిందనేది ఆసక్తి రేపేలా టీజర్‌ను కట్ చేశారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ సీరియస్‌గా ఇంటెన్స్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తోంది. ఏ ఆర్ జీవా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.
జూన్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. చార్లీ, నిరోషా, ప్రియా వెంకట్, లివింగ్ స్టోన్, ఇందుమతి, రాజ్‍కుమార్, షార్మి, లొల్లు సబా మారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.