న్యూఢిల్లీ: ఇండియా టీమ్‌లో చోటే లక్ష్యంగా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో గ్రోయిన్ ఇంజ్యురీకి గురైన కుల్దీప్ అప్పట్నించి ఆటకు దూరంగా ఉన్నాడు. చికిత్స తర్వాత గాయం పూర్తిగా మానడంతో గురువారం నెట్స్‌లో చెమటోడ్చాడు. తన బౌలింగ్‌కు సంబంధించిన 45 సెకన్ల వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీకి జట్టులో చోటు కోసం తాను కూడా రేసులో ఉన్నట్లు సంకేతాలిచ్చాడు.
అయితే కుల్దీప్ జట్టులోకి రావాలంటే ముందుగా ఫిట్‌నెస్, మ్యాచ్ సిములేషన్ టెస్ట్‌లు పాస్ కావాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ టెస్ట్‌లను ఎదుర్కోనున్నాడు. ఒకవేళ ఈ పరీక్షల్లో కుల్దీప్ ఫెయిలైతే రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిల్లో ఒకరికి గ్రీన్ సిగ్నల్ రావొచ్చు.