లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో.. సీఎం రేవంత్ భేటీ

లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో.. సీఎం రేవంత్ భేటీ

సెక్రటేరియేట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు వివిధ కంపెనీల ప్రతినిధులు. ముఖ్యమంత్రితో భేటీ అయిన లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులు...పలు కీలక విషయాలపై చర్చించారు. ఆ తర్వాత కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ ఈసీవో మథ్యూ భౌతో రేవంత్ భేటీ అయ్యారు. 

హైదరాబాద్ గ్లోబల్ సిటీ అభివృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు సీఎంకు వివరించారు కంపెనీ ప్రతినిధులు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు.. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.