BBL 2024: ఐపీఎల్ కంటే ఎక్కువే.. బిగ్ బాష్ లీగ్‌లో RCB స్టార్ క్రికెటర్‌కు భారీ శాలరీ

ఐపీఎల్ తర్వాత అత్యంత పాపులారిటీ ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ కు ఉంది. ఐపీఎల్ తో పోల్చుకుంటే ఈ లీగ్ లో ఆటగాళ్లకు శాలరీ తక్కువగానే వస్తుంది. అయితే న్యూజిలాండ్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గుసన్ కు ఐపీఎల్ కంటే ఎక్కువ డబ్బు పెట్టి బిగ్ బాష్ లీగ్ లో దక్కింది. ఐపీఎల్ లో ఈ కివీస్ ఫాస్ట్ బౌలర్ కు రూ. 2 కోట్ల రూపాయలతో రాయల్ ఛాలెంజర్స్ 2023 మినీ ఆక్షన్ లో తీసుకుంది. బిగ్ బాష్ లీగ్ లో మాత్రం ఫెర్గుసన్ రూ. 2.04 కోట్లకు సిడ్నీ థండర్ దక్కించుకుంది. 

బిగ్ బాష్ లీగ్ లో ఆటగాళ్లకు మొత్తం నాలుగు కేటగిరీలో శాలరీ ఇవ్వబడుతుంది. ఈ డ్రాఫ్ట్‌లో ప్లేయర్ ఎంపిక కోసం ప్లాటినం, గోల్డ్, సిల్వర్, కాంస్య అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ఫెర్గుసన్ ను సిడ్నీ థండర్ ప్లాటినం కేటగిరిలో దక్కించుకుంది. ఫెర్గుసన్ ప్రస్తుతం అద్భుత ఫామ్ లో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ లో అతను పపువా న్యూ గునియాపై 4 ఓవర్లు మేడిన్ వేయడం విశేషం. అగ్ర జట్లపై అతను సూపర్ బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. దీంతో ఈ కివీస్ ఫాస్ట్ బౌలర్ భారీ ధర పలికాడు. 

ALSO READ | IND vs BAN: మా నెక్స్ట్ టార్గెట్ భారత్.. టీమిండియాకు బంగ్లాదేశ్ కెప్టెన్ ఛాలెంజ్

ఫెర్గుసన్ తో పాటు వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్.. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ టామ్ కరన్ ఐపీఎల్ కంటే బిగ్ బాష్ లీగ్ లో ఎక్కువ ధర పలికారు. హోప్ ను ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 75 లక్షలకు  తీసుకుంటే అతనికి బిగ్ బాష్ లీగ్ లో రూ. 2.04 కోట్లకు హోబర్ట్ హరికేన్స్ దక్కించుకుంది. కరన్ ను ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రూ 1.5 కోట్లకు తీసుకుంది. అయితే బిగ్ బాష్ లీగ్ లో మాత్రం ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ కు రూ. 1.69 కోట్లు అందుతున్నాయి.