
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా మిగతా ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. "న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ కాలికి చాలా తీవ్రమైన గాయమైంది. అతను ఐపీఎల్ మిగతా మ్యాచ్ లకు దూరం కానున్నాడు". అని పంజాబ్ కింగ్స్ తెలిపింది. బౌలింగ్ లో కాస్త బలహీనంగా ఉన్న పంజాబ్ కింగ్స్ ఫెర్గూసన్ కు మిస్ కావడం ఆ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ.
ఈ కివీస్ పేసర్ స్థానంలో ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదు. శనివారం (ఏప్రిల్ 12) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ఆడుతుండగా ఫెర్గూసన్ గాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో కేవలం రెండు బంతులు మాత్రమే బౌలింగ్ చేసి కాలు పట్టుకొని ఇబ్బందిగా కనిపించాడు. ఎడమ తొడను పట్టుకుని కుంటుతూ కనిపించాడు. బౌలింగ్ చేయలేక పోవడంతో అతడు పెవిలియన్ కు చేరాడు. ఫెర్గుసన్ గాయం పంజాబ్ కు పెద్ద మైనస్ గా మారింది.
Also Read :- నాకెందుకు ఇస్తున్నారు.. అతడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు అర్హుడు
మొదట బ్యాటింగ్ చేసి పంజాబ్ 245 పరుగుల భారీ స్కోర్ చేసినా.. సన్ రైజర్స్ అలవోకగా లక్ష్యాన్ని ఛేజ్ చేసింది. గాయంతో ఛాంపియన్స్ ట్రోఫికి దూరమైన ఈ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్.. ఆ తర్వాత కోలుకొని ఐపీఎల్ 2025 ఆడాడు. అయితే అతనికి మరోసారి గాయం కావడంతో స్వదేశానికి పయనం కానున్నాడు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో పంజాబ్ కింగ్స్ ఫెర్గుసన్ ను రూ.2 కోట్ల కనీస ధరకు దక్కించుకుంది.
ఐపీఎల్ లో ప్రస్తుతం పంజాబ్ బాగా రాణిస్తుంది. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. మంగళవారం (ఏప్రిల్ 15) కోల్ కతా నైట్ రైడర్స్ తో కీలక మ్యాచ్ కు సిద్ధమవుతుంది. నేడు జరగనున్న ఈ మ్యాచ్ లో గెలిస్తే టాప్ 4 లో నిలుస్తుంది.
🚨 LOCKIE FERGUSON RULED OUT OF IPL 2025 DUE TO AN INJURY. 🚨 pic.twitter.com/emaOynwO16
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025