కెనడా పార్లమెంట్​కు తాళాలు

కెనడా పార్లమెంట్​కు తాళాలు

బిల్డింగ్​లో దుండగుడు

న్యూఢిల్లీ: కెనడా పార్లమెంట్​లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చొరబడ్డాడు. ఈస్ట్ బ్లాక్ సెక్షన్​కు వెళ్లిన అతను.. లోపలి నుంచి తలుపులు లాక్ చేసుకున్నాడు. దీంతో అప్రమత్తమైన పార్లమెంటరీ ప్రొటెక్టివ్ సర్వీస్ (పీపీఎస్) సిబ్బంది, ఒట్టావా పోలీసులు బిల్డింగ్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా పార్లమెంట్ భవనం చుట్టూ ఉన్న రోడ్లన్నీ బ్లాక్ చేశారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకున్నది. బిల్డింగ్​లో ఉన్న ఇతర సెక్షన్​లను ఖాళీ చేయించారు. అందరినీ సేఫ్ ప్లేస్​కు తీసుకెళ్లి లోపలి నుంచి లాక్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత.. తలుపులు తెరవాలంటూ దుండగుడికి వార్నింగ్ ఇచ్చారు. కొన్ని గంటల పాటు దుండగుడు లోపలే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో అతి కష్టం మీద ఒట్టావా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.