ఏపీలో లాకప్ డెత్.. షర్ట్ తో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య..

ఏపీలో లాకప్ డెత్.. షర్ట్ తో ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య..

ఏపీలోని కడప జిల్లాలో లాకప్ డెత్ కలకలం రేపుతోంది.. గంజాయి కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న యువకుడు లాకప్ లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ( ఏప్రిల్ 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. కడప టూ టౌన్ పోలీసులు షేక్ సోను అనే యువకుడిని గంజాయి కేసులో అదుపులోకి తీసుకున్నారు. లాకప్ లో ఉన్న సోను బాత్ రూమ్ గ్రిల్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అయితే.. అనారోగ్యంతో ఉన్న సోనును హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు చెబుతున్నారు. సోను అనారోగ్యంతో మరణించలేదని.. లాకప్ లో ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు అంటున్నారు.