ఎడ్లబండ్ల పై అక్రమంగా తరలిస్తున్నటేకు దుంగలు స్వాధీనం

మహదేవపూర్,వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ వద్ద ఎడ్లబండ్ల పై అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను మంగళవారం ఉదయం ఫారెస్ట్ ఆఫీసర్లు  పట్టుకున్నరు. ఎఫ్ఆర్​ఓ  కమల తెలిపిన వివరాల ప్రకారం..  సూరారం ఎఫ్ ఎస్ వో వరుణ్ కు అక్రమంగా టేకు దుంగలను తరలిస్తున్నారని సమాచారం అందింది.    

సిబ్బంది తో  అడవిలో  సెర్చ్ నిర్వహించగా రెండు ఎడ్ల బండ్ల పై  కొందరు దుంగలను తరలిస్తున్నారు. అధికారులను చూసిన వారు.. ఎడ్లను  తప్పించి, బండ్లను వదిలి పారిపోయారు. దీంతో బండ్లను, కలపను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని మహదేవపూర్ డిపోకు తరలించామని, స్మగ్లర్లు వదిలి వెళ్ళిన కలప విలువ లక్ష రూపాయలు ఉంటుందని ఎఫ్ ఆర్ ఓతెలిపారు. సెర్చ్ లో ఎఫ్ఎస్ వో కృష్ణ కాంత్ , ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.