జనగామ అర్బన్, వెలుగు : ఈ నెల 30న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని జనగామ జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా జడ్జి డి.రవీంద్రశర్మ సూచించారు. డీసీపీ సీతారాంతో కలిసి బుధవారం జనగామ జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. లోక్ అదాలత్‌కు అధిక సంఖ్యలో హాజరై కేసులు పరిష్కరించుకునేలా పోలీసులు అవగాహన కల్పించాలని సూచించారు.
పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, న్యూసెన్స్, చీటింగ్, పీడీ, యాక్సిడెంట్ కేసుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్, జూనియర్ సివిల్ జడ్జి సుచరిత, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ డి.వెంకటనర్సయ్య, జనగామ ఏసీపీ దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.