బండి సంజయ్ అరెస్టుపై లోక్ సభ బులిటెన్ విడుదల

బండి సంజయ్ అరెస్టుపై లోక్ సభ బులిటెన్ విడుదల

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ పై లోక్ సభ సెక్రటేరియట్ బులిటెన్ రిలీజ్ చేసింది. 151 సీఆర్పీసీ  కింద ముందస్తు కస్టడీలోకి తీసుకున్నామని బొమ్మల రామారం  పోలీసులు తెలిపినట్లు బులిటెన్ లో తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకే బండి సంజయ్ ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కరీంనగర్ లో సంజయ్ ని అరెస్ట్ చేసి తర్వాత రాజకొండ పరిధిలోని బొమ్మల రామారం స్టేషన్ కు తరలించినట్లు బులిటెన్ లో వెల్లడించారు. అనంతరం కస్టడీ నుంచి విడిచిపెట్టినట్లు లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి కరీంనగర్ పోలీసులు తెలిపారు. 

బండి సంజయ్ అరెస్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల నిరసనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారంలో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.