లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్

సూర్యాపేట: రాష్ట్రంలో బీఆర్​ఎస్​ పని అయిపోయిందని, ఆ పార్టీ గురించి మాట్లాడితే సమయం వృథా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  ఇవాళ సూర్యాపేటలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈనెల30  నల్లగొండ ఎంపీ పరిధిలోని ముఖ్యులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే  పోటీ ఉంటుందన్నారు. ఎంపీ ఎన్నికల తరువాత బీఆర్​ఎస్​ మనుగడ ప్రశ్నార్థకం కానుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ  నెరవేరలేదని, ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.

కాళేశ్వరం అవినీతిపై మాట్లాడే మోడీ కేంద్ర సంస్థలు రుణాలు ఎలా ఏర్పాటు చేశారని నిలదీశారు. అన్ని విధాలుగా మోడీ హయాంలో ప్రజాస్వామ్యం అణచి వేయబడుతుందని ఆరోపించారు. బీజేపీకి,  మోడీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో  దేశంలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, రాష్ట్రంలో  కాంగ్రెస్​కు13లేదా 14 స్థానాలు వస్తాయని ఆయన అన్నారు.