దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం ఢిల్లీలో 7 పార్లమెంట్ సీట్లు ఉండగా.. నాలుగు సీట్లలో ఆప్, మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేయడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. 2014, 19 ఎన్నికల్లో ఢిల్లీలో అన్ని పార్లమెంట్ స్థానాలలో బీజేపీనే గెలిచింది. ఈ సారి బీజేపీకి గెలిచే అవకాశం ఇవ్వొద్దని ఇరు పార్టీలు భావిస్తున్నాయి.
గుజరాత్‌లో ఆప్‌కి కాంగ్రెస్ రెండు సీట్లు ఇవ్వనుండగా, హర్యానా, అస్సాంలో ఒక్కో సీటుపై ఒప్పందం కుదిరిందని సమాచారం. ఇక పంజాబ్ లో మాత్రం ఆప్ -ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇక ఉత్తర ప్రదేశ్ లో సమాజ్‌వాదీ పార్టీ 17 సీట్లను కాంగ్రెస్ కు ఆఫర్ చేసింది.
మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాలకు గాను కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎస్పీ ఒక స్థానంలో పోటీ చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్-మేలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మార్చి సెకండ్ వీక్‌లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
ఢిల్లీలో ఆప్ పోటీ చేసే స్థానాలు ..
1. న్యూ ఢిల్లీ
2. వాయువ్య ఢిల్లీ
3. పశ్చిమ ఢిల్లీ
4. దక్షిణ ఢిల్లీ
కాంగ్రెస్ పోటీ చేసే మూడు స్థానాలు ..
1. తూర్పు ఢిల్లీ
2. ఈశాన్య ఢిల్లీ
3. చాందినీ చౌక్