మధ్యప్రదేశ్ ​ఎన్నికల్లో .. అఖిలేశ్ ‘పీడీఏ’ నినాదం

మధ్యప్రదేశ్ ​ఎన్నికల్లో ..  అఖిలేశ్ ‘పీడీఏ’ నినాదం
  • ఇండియా కూటమి మాటెత్తని యూపీ మాజీ సీఎం 
  • ఆరు సీట్లిస్తామని కాంగ్రెస్ మాట తప్పిందని విమర్శలు

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమితో సమాజ్‌‌‌‌‌‌‌‌వాదీ పార్టీ (ఎస్పీ) సంబంధాలు కొనసాగించే విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పీడీఏ నినాదం ఎత్తుకున్నారు. పీడీఏ అంటే పిచ్డే(వెనకబడిన వర్గాలు), దళిత్, అల్పసంఖ్యాక్​(మైనారిటీ) అని అర్థం.  పీడీఏను ప్రస్తావిస్తూ ఆదివారం ట్విట్టర్​లో పోస్ట్  చేసిన ఒక ఫొటో అనుమానాలను పెంచుతున్నది. 

ఓ ఎస్పీ కార్యకర్త వీపుపై పార్టీ జెండా రంగులైన ఎరువు, ఆకపచ్చతో పాటు పీడీఏను సూచిస్తూ ఒక మెసేజ్ ఉంది. ‘మిషన్ 2024. ములాయం సింగ్​ ఇప్పటికీ చిరంజీవే. పీడీఏ ఈసారి ఎన్నికల్లో మనకు విజయాన్ని అందిస్తుంది. పేదలకు న్యాయం జరిగేలా అఖిలేశ్ ​చూస్తారు’ అని ఆ మేసేజ్ సారంశం. తన ట్వీట్​లో ఆయన ఎక్కడా కూడా ఇండియా కూటమి పేరు ప్రస్తావించకపోవడం గమనార్హం. ఇండియా కూటమిలో భాగమైన తమకు మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఎస్పీ ఆరు సీట్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మొండిచేయి చూపిందంటూ అఖిలేశ్ ఆరోపించారు. కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తుంటే వారి వెంట ఎవరు ఉంటారు? అని ప్రశ్నించారు.