ఆంధ్ర ప్రదేశ్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం మరో జాబితా విడుదల చేసింది. ఏపీలో 9, జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం(ఏప్రిల్ 21) విడుదల చేశారు. శ్రీకాకుళం లోక్‌సభ నుంచి పి.పరమేశ్వరరావు, విజయనగరం నుంచి బొబ్బిలి శ్రీను, అమలాపురం నుంచి జంగా గౌతమ్, మచిలీపట్నం స్థానం నుంచి గొల్లు కృష్ణ, అనంతపురం నుంచి మల్లికార్జున్ వజ్జల పోటీ చేస్తున్నారు.
ఏపీ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల తాజా జాబితా
- 1. శ్రీకాకుళం - పి.పరమేశ్వరరావు
- 2. విజయనగరం - బొబ్బిలి శ్రీను
- 3. అమలాపురం - జంగా గౌతమ్
- 4. మచిలీపట్నం - గొల్లు కృష్ణ
- 5. విజయవాడ - వల్లూరు భార్గవ్
- 6. ఒంగోలు - ఈద సుధాకర్‌రెడ్డి
- 7. నంద్యాల - జె.లక్ష్మీ నరసింహ యాదవ్
- 8. అనంతపురం - మల్లికార్జున్ వజ్జల
- 9. హిందూపురం - బీఏ సమద్ షహీన్
కాంగ్రెస్ అధినాయకత్వం గతంలో ప్రకటించిన ఏపీ లోక్‌సభ స్థానాల అభ్యర్థులు
- 1. విశాఖపట్నం- పులుసు సత్యనారాయణరెడ్డి
- 2. అనకాపల్లి- వేగి వెంకటేశ్
- 3. ఏలూరు- శ్రీమతి లావణ్య కావూరి
- 4. నర్సరావుపేట- జి.ఎ. సుధాకర్
- 5. నెల్లూరు- కొప్పుల రాజు
- 6. తిరుపతి- చింతామోహన్
- 1. కాకినాడ - ఎంఎం పల్లం రాజు
- 2. రాజమండ్రి - గిడుగు రుద్రరాజు
- 3. బాపట్ల - జె.డి. శీలం
- 4. కర్నూల్ -పీజీ రామ్ పుల్లయ్య యాదవ్
- 5. కడప - వై. ఎస్. షర్మిళ రెడ్డి