లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపు: ఫలితాలను ఇలా తెలుసుకోండి 

లోక్‌సభ ఎన్నికల 2024 ఓట్ల లెక్కింపు: ఫలితాలను ఇలా తెలుసుకోండి 

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రేపు (జూన్ 4న )విడుదల కానున్నాయి.దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ సూచనలు చేసింది. 543 లోక్ సభ నియోజకవర్గాలు, ఏపీ, తెలంగాణతో సహా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించే ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మంగళవారం ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న క్రమంలో తమ తమ నియోజకవర్గాల్లోని ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఎన్నికల సంఘం అధికారి వెబ్ సైట్ results.eci.gov.in  ను సంప్రదిస్తే ఖచ్చిత మైన ఫలితాలను తెలుసుకోవచ్చు. దీంతో అనేక వెబ్ సైట్లు, టీవీ ఛానెళ్లు లైవ్ ప్రసారం చేయనున్నాయి. మహారాష్ట్ర లో ఎన్నికల ఫలితాలను చూసేందుకు ఏకంగా థీయేటర్ల యజమానులు తమ థియేటర్లలో లైవ్ షోలను ఏర్పాటు చేశారు.   

EC అధికారిక వెబ్‌సైట్‌ results.eci.gov.inకి వెళ్లి సాధారణ ఎన్నికలపై క్లిక్ చేసీ మీ రాష్ట్రం, నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా ఎన్నికల ఫలితాలను పొందొచ్చు. ఎన్నికల సంఘం అధికారిక  వెబ్‌సైట్‌తో పాటు, లోక్‌సభ నియోజకవర్గం RO/ARO నమోదు చేసిన డేటా ప్రకారం కౌంటింగ్ ట్రెండ్‌, ఫలితాలు ప్లే స్టోర్‌ల నుండి డౌన్‌లోడ్ చేసుకోగలిగే ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌ లు కూడా అందుబాటులో ఉంటాయి.