గుర్రం మీదొచ్చి ఓటేసిండు

మేళ్లచెర్వు, వెలుగు: లోక్​సభ ఎన్నికల పోలింగ్ వేళ ఓ ఓటరు గుర్రం మీద పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లడం అందరి దృష్టినీ ఆకర్షించింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం రేబల్లె మాజీ సర్పంచ్ ఇనుపకుతికెల నర్సింహమూర్తి శర్మ అదే గ్రామంలో ఓటేసేందుకు తన ఇంటి నుంచి గుర్రం మీద బయల్దేరారు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. ఆయన గుర్రం మీద వెళ్తుండటంతో స్థానికులు ఆసక్తిగా చూశారు. గుర్రపు స్వారీ అలవాటు ఉండటంతో ఓటు హక్కును ఇలా విన్నూత్నంగా వేశానని నర్సింహమూర్తి చెప్పాడు. ఓటు ప్రాధాన్యతను తెలియజేసేందుకూ ఇది ఉపయోగపడిందని ఆయన తెలిపాడు.