లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నయ్ : డీజీపీ రవిగుప్తా

లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నయ్ :  డీజీపీ రవిగుప్తా

తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవిలతపై మలక్ పేట్, మంగలహాట్ పోలీస్ స్టేషన్ లలో రెండు కేసులు నమోదయ్యాయన్నారు రవిగుప్తా.  

డీజీపీ ఆఫీస్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి ప్రతీ క్షణం మానిటరింగ్ చేస్తున్నామని  రవిగుప్తా తెలిపారు.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకు పోలింగ్ ముగుస్తుందని..  పోలింగ్ పూర్తయిన తర్వాత కేంద్ర బలగాలతో ఈవీఎం లను స్ట్రాంగ్ రూమ్స్ కి తరలిస్తామని వెల్లడించారు.  చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్కౌంటర్ ప్రభావం తెలంగాణ దగ్గర లేదన్నారు.  ప్రజలంతా బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.