తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంట్ స్థానాలకు... తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు, కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సాయంత్రం  ఆరు గంటలకు  పోలింగ్ పూర్తి అయింది.  ఇప్పటికే  పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ల ఉన్న వారిక ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఏపీలో గ్రామీణంతోపాటు పట్టణ ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున పోలింగ్ లో పాల్గొని ఓటు వేశారు.  సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో 67.04శాతం, తెలంగాణలో 61.16శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.