
గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సగం మంది కాంగ్రెస్ నేతలు బీజేపీతో చేతులు కలిపారంటూ సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ నేతలు బీజేపీకి బీ టీంగా పని చేస్తున్నారని ఫైర్ అయ్యారు రాహుల్ గాంధీ. బీజేపీకి బీ టీంగా పనిచేస్తున్న వాళ్ళను బయటకు పంపుతామని.. కాంగ్రెస్ లో నేతలకు కొదవలేదని అన్నారు రాహుల్.
కాంగ్రెస్ నేతలు పెద్దపులి లాంటివారని.. కానీ ఎవరో వాళ్ళను గొలుసులతోబంధించారని అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ కు 22శాతం ఓట్లు పెరిగాయని.. గుజరాత్ లో విపక్షానికి 40శాతం ఓటు బ్యాంక్ ఉందని అన్నారు. గుజరాత్ లో 30ఏళ్లుగా అధికారానికి దూరం అవ్వటానికి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరి వైఫల్యమే కారణమని అన్నారు రాహుల్ గాంధీ.
గుజరాత్ లో కాంగ్రెస్ అంచనాలు అందుకోలేకపోతోందని.. కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా భయంతో కానీ, సిగ్గుతో కానీ ఈ మాటలు అనడంలేదని అన్నారు రాహుల్ గాంధీ.