తెలుగు హీరోయిన్ కు బీజేపీ టికెట్

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రెండు స్థానాలతో ఏడో జాబితాను రిలీజ్ చేసింది. మహారాష్ట్రలోని అమరావతి నుంచి నవనీత్ రాణాను, చిత్రదుర్గ నుంచి గోవింద్ కర్జోల్‌ను బరిలోకి దింపింది. నవనీత్ కౌర్ రానా తెలుగులో కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె భర్త రవి రాణా ఎమ్మెల్యేగా ఉన్నారు.  2019లో అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు  నవనీత్.. శివసేనకు చెందిన ఆనందరావు అద్సుల్‌పై విజయం సాధించారు.   ఆ తరువాత బీజేపీలో చేరారు.    ఏడో జాబితాతో బీజేపీ ఇప్పటివరకు 407 మంది అభ్యర్థులను ప్రకటించింది. 101 మంది  సిట్టింగ్  ఎంపీలకు టిక్కెట్లు ఇవ్వలేదు.