కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు

కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు

బెంగళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు లోకాయుక్త సమన్లు జారీ చేసింది. మైసూరు భూ కుంభకోణం కేసులో ఈ నెల 6న విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి లోకాయుక్త పోలీసులు ఇప్పటికే సీఎం భార్య పార్వతిని ప్రశ్నించారు. లోకాయుక్త ద్వారా సీఎంను ప్రశ్నించడానికి అనుమతించే హక్కు గవర్నర్‌‌‌‌కు ఉందని కోర్టు ప్రకటించిన నేపథ్యంలో సమన్లు జారీ అయ్యాయి. ఈమేరకు ప్రత్యేక కోర్టు ఆదేశాలతో లోకాయుక్త ఇప్పటికే ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది. బెంగళూరు సిటీకి సమీపంలోని కేసరే గ్రామంలోని 3.16 ఎకరాల భూమికి పరిహారంగా పార్వతికి 14 హై వ్యాల్యూ ప్లాట్లను కేటాయించడంపై కేసు నమోదైంది.