
వెలుగు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొడుకు లోకేశ్ మరోసారి కామెడీ పండించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేయబోతూ సోషల్ మీడియాకు మళ్లీ దొరికిపోయారు. ఏకంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం పోర్టును తెలంగాణకు తరలించుకు పోయేందుకు కేసీఆర్ అహర్నిశలు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం మంగళగిరిలోని రేవేంద్రపాడులో మాట్లాడుతూ లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే ఆంధ్రాలో నేరుగా పోటీ చేయాలని, చంద్రబాబుతో పోటీ చేయలేక మోడీ, కేసీఆర్, జగన్ ఒక్కటై కుట్రలు చేస్తున్నారన్నారు.
‘‘మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. కేసీఆర్‌గారు ఆంధ్రరాష్ట్రం వస్తున్నారంటే దానికి కారణాలు రెండే రెండు. ఒకటి.. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురైనమండలాలను వెనక్కి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. రెండోది.. ఇక్కడున్న మన మచిలీపట్నం పోర్టు తెలంగాణకు తీసుకెళ్లడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నడు’’ అన్నారు