ఏపీలో లోకేశ్ రాజ్యాంగం.. ఢిల్లీలో వైఎస్ జ‌‌‌‌గ‌‌‌‌న్‌‌‌‌ నేతృత్వంలో వైసీపీ నేతల ధర్నా

న్యూఢిల్లీ, వెలుగు: ఏపీలో  మంత్రి లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌‌‌‌లు అవుతున్నద‌‌‌‌ని వైసీపీ చీఫ్, మాజీ సీఎం వైఎస్ జ‌‌‌‌గ‌‌‌‌న్మోహ‌‌‌‌న్ రెడ్డి ఆరోపించారు. ఏపీలోని ప్రతిప‌‌‌‌క్ష పార్టీల‌‌‌‌పై రోజు రోజుకూ దాడులు పెరుగుతున్నాయని..అస‌‌‌‌లు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అమ‌‌‌‌లులో ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల అనంత‌‌‌‌రం వైసీపీ కార్యర్తలపై జరుగుతున్న దాడుల‌‌‌‌ను నిర‌‌‌‌సిస్తూ బుధవారం ఢిల్లీలోని జంత‌‌‌‌ర్ మంత‌‌‌‌ర్‌‌‌‌ వద్ద జ‌‌‌‌గ‌‌‌‌న్ నేతృత్వంలో  వైసీపీ నేతలు ధర్నా చేశారు.

 దాడుల్లో మ‌‌‌‌ర‌‌‌‌ణించిన, గాయపడిన వారి ఫోటోలు, వీడియోలతో ఎగ్జిబిష‌‌‌‌న్ గ్యాల‌‌‌‌రీ ఏర్పాటు చేశారు. ఈ ధర్నాకు అఖిలేశ్ యాద‌‌‌‌వ్‌‌‌‌, రాంగోపాల్ యాద‌‌‌‌వ్ (ఎస్‌‌‌‌పీ), సంజ‌‌‌‌య్ రౌత్‌‌‌‌, అర‌‌‌‌వింద్ సావంత్‌‌‌‌, ప్రియాంక చ‌‌‌‌తుర్వేది (శివ‌‌‌‌సేన‌‌‌‌), న‌‌‌‌దిముల్ హ‌‌‌‌క్ (టిఎంసి), తంబిదొరై (అన్నాడీఎంకె), తిరుమా వలవన్ (వీసీకే), రాజేంద్రపాల్‌‌‌‌ గౌతమ్ (ఆప్‌‌‌‌), అబ్దుల్‌‌‌‌ వాహబ్, హ్యారిస్ (ఐయూఎంఎల్‌‌‌‌) పార్టీల నేత‌‌‌‌లు హాజరై, మ‌‌‌‌ద్దతు తెలిపారు. జ‌‌‌‌గ‌‌‌‌న్ మాట్లాడుతూ.." మంత్రి నారా లోకేశ్ రెడ్‌‌‌‌బుక్ పేరుతో హోర్డింగ్‌‌‌‌లు పెట్టిస్తున్నార‌‌‌‌ు. ఎవరెవరి మీద దాడుల చేయాలి, ఎవరిని ఎలా వేధించాలని అందులో చెబుతున్నారు. టీడీపీ వాళ్లు దాడులు, ఆస్తుల విధ్వంసం చేసినా ఏ చర్యా తీసుకోవద్దని రాష్ట్ర పోలీసులకు ఆదేశించారు. రెడ్‌‌‌‌బుక్‌‌‌‌ను గ్రామ స్థాయి వ‌‌‌‌ర‌‌‌‌కు తీసుకెళ్లారు. రాష్ట్రంలో రాజ్యాంగం కాకుండా, రెడ్ బుక్ రాజ్యాంగం ప‌‌‌‌నిచేస్తున్నది" అని జగన్ ఆరోపించారు. 

45 రోజుల్లో 30 హత్యలు

రాష్ట్రంలో  టీడీపీ నేతృత్వంలో 45 రోజులుగా అరాచక, ఆటవిక పాలన కొనసాగుతున్నదని జగన్ తెలిపారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. యథేచ్ఛగా హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసం చేస్తున్నారు. వైసీపీని అణగదొక్కడమే ప్రభుత్వ లక్ష్యంగా మారింది. అందుకే హత్యలు, దాడులు, అకృత్యాలను ప్రోత్సహిస్తున్నది.  అధికారంలోకి వచ్చిన కేవలం 45 రోజుల్లోనే 30 హత్యలు జరిగాయి. 300 మందిపై హత్యాయత్నాలు జరిగాయి. 560 చోట్ల ప్రైవేటు ఆస్తులు, 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా దౌర్జన్యాలు జరిగాయి.  త‌‌‌‌మ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డిపై పట్టపగలే రాళ్లదాడి జరిగింది. మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ చేయలేదు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో అరాచక పాలన ఉంది. ఈ విధ్వంసాన్ని ప్రశ్నించకపోతే, వెంటనే ఆపలేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేం" అని జగన్ పేర్కొన్నారు.