లియో మూవీపై వస్తున్న ఆ వార్తలు నిజమే.. ఎట్టకేలకు ఒప్పుకున్న లోకేష్

లియో మూవీపై వస్తున్న ఆ వార్తలు నిజమే.. ఎట్టకేలకు ఒప్పుకున్న లోకేష్

తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లియో(Leo). స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay thalapathy) ప్రధాన పాత్రలో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ 19న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ కాసుల వర్షం కురిపించారు. మొదటి రోజు రూ.140 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఇప్పటివరకు రూ.500 కోట్లకు పైగా రాబట్టి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

అయితే ఈ సినిమాకు నార్మల్ ఆడియన్స్ నుండి కాస్త నెగిటీవ్ టాక్ వచ్చింది. కారణం.. లియో సెకండ్ హాఫ్ చాలా స్లో అండ్ లాగ్ గా ఉండటమే. ఇదే విషయాన్ని చాలా మంది ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఇదే విషయంపై స్పందించాడు దర్శకుడు లోకేష్. కార్తీ హీరోగా వస్తున్న జపాన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన లోకేష్ మాట్లాడుతూ... లియో మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందంగా ఉంది, సెకండాఫ్ పై మిక్సుడ్ రివ్యూలు వచ్చిన మాట నిజమే, కొంత ల్యాగ్ ఉందని నేను కూడా ఏక్సెప్ట్ చేస్తున్నాను,  లియో స్క్రిప్టు ఐదేళ్ల క్రితం రాసుకున్నాను, దానికి కొత్తగా ఏమీ యాడ్ చేయలేదు. అందుకే కాస్త లాగ్ అయిందని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు లోకేష్.

Also Read :- మెగా ఫ్యామిలీ నుండి ఆమె దూరం

ఇక ఇదే సందర్బంగా ఆయన చేయబోయే ఖైదీ సీక్వెల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు లోకేష్. సీక్వెల్ గురించి మాట్లాడిన లోకేష్.. ఖైదీ మూవీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం లోకేష్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.