న్యూఢిల్లీ: ఇంగ్లండ్ టూర్ తర్వాత ఆటకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, గాయం నుంచి కోలుకున్న లోకేశ్ రాహుల్ యూఏఈ వేదికగా ఈ నెల 27 నుంచి జరిగే ఆసియా కప్ టీ20 టోర్నీతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ టోర్నీకోసం సెలక్షన్ కమిటీ సోమవారం 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. రోహిత్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో కేఎల్ రాహుల్, విరాట్‌చోటు దక్కించుకున్నారు.
గాయాల కారణంగా స్టార్ పేసర్ బుమ్రా, హర్షల్ పటేల్ టీమ్‌కు దూరమయ్యారు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్‌లను సెలెక్టర్లు స్టాండ్‌బైగా తీసుకున్నారు.
టీమ్: రోహిత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, హుడా, పంత్ (కీపర్), కార్తీక్ (కీపర్), హార్దిక్, జడేజా, అశ్విన్, చహల్, బిష్ణోయ్, భువనేశ్వర్, అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్.