AP News: మళ్లీ తెరపైకి మంత్రి లోకేష్ రెడ్​బుక్​.. ఆయన ఏమన్నారంటే

ఆంధ్రప్రదేశ్​ మంత్రి లోకేష్ రెడ్ బుక్​ మళ్లీ తెరపైకి వచ్చింది.  గత ప్రభుత్వంలో .. చట్టాలను ఉల్లంఘించిన అధికారుల పేర్లను.. వైసీపీ నేతలను రెడ్ బుక్​లో నమోదు చేస్తామని అప్పట్లో లోకేష్​ చెప్పారు. రెడ్​ బుక్​ లో పేర్లు ఉన్న ప్రతి వ్యక్తిని చట్ట ప్రకారం శిక్షిస్తామని తెలిపారు. రెడ్ బుక్​ విషయంలో నారా లోకేష్​ మాట్లాడుతూ.. ఇప్పటికే కొంతమంది అధికారులను సస్పెండ్​ చేశామని.. మరికొంతమందికి పోస్టింగ్​ ఇవ్వలేదన్నారు.  ఇంకా కొంతమందిపై కేసులు కూడానమోదు చేశామన్నారు. ఎలాంటి చర్య తీసుకున్నా న్యాయ బద్దంగా.. సిస్టమేటిక్​గా  చేస్తామని మంత్రి లోకేష్​ తెలిపారు. 

ALSO READ | ఇదేమి ఆనందం పవన్..! ప్రకాష్ రాజ్ మరో ఇంట్రెస్టింగ్ ట్వీట్

ప్రస్తుత ప్రభుత్వంలో ఎవరూ పరదాలు కట్టుకుని రావడం లేదని.. గత ముఖ్యమంత్రి భద్రతా సిబ్బందితో పోలిస్తే.. సీఎం చంద్రబాబు భద్రతా సిబ్బంది చాలా తక్కువుగా ఉన్నారన్నారు.  తన పర్యటనకు బందోబస్తు అవసరం లేదని.. లా అండ్​ ఆర్డర్​ విధులు నిర్వహించాలని డీజీపీకి చెప్పానన్నారు.  ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్నామని.. జనాలకు ఇబ్బంది కలిగేలా ట్రాఫిక్​ ను ఆపవద్దని మంత్రి లోకేష్​ తెలిపారు.  

.