సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో లోకేష్ పేరు

సీఐడీ రిమాండ్ రిపోర్ట్‌లో లోకేష్ పేరు

చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను సీఐడీ వెల్లడించింది. చంద్రబాబును ఏసీబీ కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా ఏపీ సీఐడీ కోర్టుకు 28 పేజీలతో రిమాండ్ రిపోర్టును సమర్పించింది. అయితే ఈ  రిమాండ్ రిపోర్ట్‌లో నారా లోకేష్ పేరు కూడా చేర్చారు. చంద్రబాబు సన్నిహితుడు కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌కు డబ్బులు అందినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సీఐడీ. 

చంద్రబాబు, అచ్చెన్నాయుడు కలిసి ఈ స్కామ్ చేశారన్న సిట్... వివిధ కంపెనీల ద్వారా డబ్బును కిలారు రాజేష్ ద్వారా లోకేష్‌ ,  చంద్రబాబు పీఏ శ్రీనివాస్ లకు చేరిందని వెల్లడించింది.   త్వరలోనే లోకేష్‌ని కూడా అరెస్ట్ చేసి ఆయన్ని విచారించనున్నారు సీఐడీ అధికారులు. చంద్రబాబును కోర్టులో హాజరు పరిచి...ఆయన్ని ముద్దాయిగా చేర్చాలని కోర్టుకు సీఐడీ పోలీసులు మెమో దాఖలు చేశారు. ఎఫ్ఐఅర్‌లో చంద్రబాబు పేరు లేకపోవడంతో పోలీసులు మెమో వేశారు.

రాజకీయ కక్షతోనే నాపై కేసు నమోదుచేశారని, నేను ఏ తప్పూ చేయలేదని చంద్రబాబు వాదించారు. శనివారం ఉదయం 5.40 గంటలకు పోలీసులు నోటీలు ఇచ్చారని, ఇవాళ ఉదయం 5.04 గంటలకు రిమాండ్ రిపోర్టు ఇచ్చారన్నారు. హాలులో ఉంటారా? బయటకు వెళ్తారా? అని న్యాయమూర్తి అడిగితే.. వాదోపవాదాలు ముగిసే వరకూ తాను కోర్టులో ఉంటానని చెప్పారు.