వక్ఫ్ బిల్లుపై గందరగోళం.. లోక్ సభ మార్చి 10వ తేదీకి వాయిదా..

వక్ఫ్ బిల్లుపై గందరగోళం.. లోక్ సభ మార్చి 10వ తేదీకి వాయిదా..

లోక్ సభ మార్చి 10వ తేదీకి వాయిదా పడింది. వక్ఫ్ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టిన కేంద్రం.. ఆ తర్వాత మధ్య లోక్ సభలోనూ ప్రవేశ పెట్టింది. వక్ఫ్ సవరణ బిల్లుపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. 

వక్ఫ్ బిల్లుపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతుండగా సభలో గందరగోళం నెలకొంది. బిల్లును వ్యతిరేకిస్త సభ్యులు ఆందోళన చేశారు. దీంతో స్పీకర్ లోక్ సభను మార్చి 10వ తేదీ వరకు వాయిదా వేశారు.

Also Read :- లోక్‌సభలో కొత్త ఇన్‌కమ్‌ ట్యాక్స్ బిల్లు

అదే విధంగా ఇవాళ (ఫిబ్రవరి 13) లోక్ సభలో కొత్త ఐటీ బిల్లు (ఇన్ కమ్ ట్యాక్స్ బిల్లు) ను ప్రవేశ పెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వక్ఫ్ బిల్లుపై విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ ఐటీ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లు కొత్త ఐటీ బిల్లు తీసుకొచ్చినట్లు మంత్రి తెలిపారు. కొత్త బిల్లుతో మధ్య తరగతి ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఆ తర్వాత ఐటీ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపింది కేంద్రం.