NDA వర్సెస్ UPA : మోడీకి కీలకం ఈ మూడే..!

మోడీకి కీలకం ఈ మూడే 8 రాష్ట్రా ల్లో ఎన్డీయే వర్సెస్ యూపీఏ 3 రాష్ట్రా ల్లో మోడీకి వ్యతిరేకంగా ఏకమైన ప్రతిపక్షాలు బెంగాల్, ఒడిశా, ఈశాన్యం పై బీజేపీ ఆశలు మోడీ మళ్లీ ప్రధాని అవుతారా ? అరకొర మెజార్టీతో అయినా గద్దెనెక్కుతారా ? లేదంటే ప్రతిపక్షానికే పరిమితం అవుతారా ? ఏ ఎన్నికల్లో అయినా గెలుపోటములు స్థూ లంగా సంప్రదాయ ఓటర్లను కాపాడుకుం టూనే వైరి పక్షం ఓట్లను ఆకర్శించడంపై ఆధారపడి ఉంటుంది. అయితే భౌగోళికంగా, సాంస్కృతికంగా విభిన్నం గా ఉన్న ఇండియాలో ప్రజల నాడిని నూటికి నూరు శాతం పట్టుకోవడం అసాధ్యం. అయినప్పటికీ ఎన్నికల విశ్లేషకులు మోడీ గెలుపోటములను లెక్కకట్టే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్రాల వారీగా .. ఢిల్లీ, హర్యానా, అస్సాం తో పాటు మిగతా ఈశాన్య రాష్ట్రాల్లో మోడీకి 2014 ఎన్నికల మాదిరిగానే సానుకూల పవనాలు వీస్తున్నాయి. అయితే 74 శాతం లోక్ సభ సీట్లను కట్టబెట్టి న 13 రాష్ట్రా ల్లో బీజేపీ స్థితిగతులపైనే మోడీ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఎన్డీయే వర్సెస్ యూపీఏ-( లోక్ సభ స్థానాలు 162 )

ఎన్డీయే, యూపీఏ కూటములు 8 రాష్ట్రా ల్లో ఫేస్ టూ ఫేస్ తలపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థా న్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రా ల్లో ఈ రెండు కూటముల మధ్యే ప్రధానంగా పోరు సాగనుంది. ఈ 8 రాష్ట్రా ల్లో ని 162 లోక్ సభ స్థా నాల్లో 151 స్థా నాలను 2014లో ఎన్డీయే కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో పరిస్థితులు మారిపోయాయి. 2014 ఎన్నికలప్పుడు ఎన్డీయే కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నీ ఇప్పుడు బీజేపీతో లేవు. దీంతో కిందటి ఎన్నికల్లో తమకు ఓటేసిన వారందరినీ ఈసారి కూడా ఒప్పించడం బీజేపీకి కష్టమే. తాజా అంచనాల ప్రకారం మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రా లను మినహాయిస్తే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా మిగతా ఆరు రాష్ట్రా ల్లో ని మొత్తం 162 స్థా నాల్లో బీజేపీకి ఈసారి 58 స్థా నాలు మాత్రమే దక్కే అవకాశం ఉన్నట్లు అంచనా.

ఒక్కటైన ప్రతిపక్షాలు-(లోకసభ స్థానాలు: 148)

2014 లోక్ సభ ఎన్ని కల్లో ఎన్డీయే కూటమి ఉత్తరప్రదేశ్, బీహార్, కర్నాటక రాష్ట్రా ల్లోని మొత్తం148 స్థా నాల్లో ఏకంగా 121 సీట్లను కైవసం చేసుకుంది. కాని ఈసారి ప్రతిపక్షాలన్నీ ఒక్కటై కాషాయ పార్టీపై కత్తి కట్టడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.

ఉత్తరప్రదేశ్ ( 80 లోక్ సభ సీట్లు )

2014 లోక్ సభ ఎన్ని కల్లో ఉత్తరప్రదేశ్ లోని 80 స్థా నాల్లో బీజేపీ ఏకంగా 73 గెల్చుకుంది. అయితే ఇప్పుడు ఎస్పీ,బీఎస్పీ కూటమితో పరిస్థితులు మారిపోయాయి. ఈసారి ఎన్డీయేకు యూపీలో కేవలం 37 స్థా నాలు మాత్రమే దక్కే అవకాశం ఉన్నట్లు విశ్లేషకు ల అంచనా.

బీహార్ ( లోక్ సభ సీట్లు 40 )

నరేం ద్రమోడీతో విభేదిం చి ఎన్డీయే కూటమిలోం చి బయటకు వచ్చేసిన నితీశ్ కూమార్ నేతృత్వంలో ని జేడీయూ 2014లో ఒంటరిగా పోటీ చేసింది. 16 శాతం ఓట్లు వచ్చినా కేవలం రెండు స్థా నాలను మాత్రమే గెల్చుకుంది. అయితే 22 స్థా నాల్లో ఓట్లు చీల్చడంతో బీజేపీకి లాభం చేకూరింది. ఓట్ల చీలికతో బీజేపీ 17 స్థా నాల్లో గెలిచింది. అయితే ఇప్పుడు జేడీయూ ఎన్డీయే కూటమిలో చేరింది. దీంతో జేడీయూ ఓట్లు ఎన్డీయేకు పడతాయా లేక నరేంద్ర మోడీపై ఉన్న వ్యతిరేకత కారణంగా జేడీయూకు చెందిన ముస్లిం ఓట్లు యూపీఏకు పడతాయా అనేదానిపై ఫలితాలు ఆధారపడి ఉన్నాయి.

కర్నాటక ( లోక్ సభ సీట్లు 28)

కర్నాటకలో కాం గ్రెస్, జేడీయూ కూటమి ఈసారి బీజేపీకి గట్టి పోటీనే ఇవ్వనుంది. రాష్ట్రంలోని 28 స్థానాల్లో ఈ కూటమికి 21 సీట్లు దక్కే అవకాశం ఉంది. ప్రాంతీయ పార్టీలపై వ్యతిరేకత ( లోకసభ స్థానాలు 63 ) బీజేపీ అంతో ఇంతో బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్ , ఒడిశాపై మోడీ చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి కలిసి వస్తుందని ఆశిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ ( లోక్ సభ సీట్లు 42 )

లెఫ్ట్ పార్టీలు ప్రాభవం కోల్పోవడంతో ఈపార్టీ ఓట్లపై టీఎంసీతో పాటు బీజేపీ కూడా కన్నేసింది. ఇంత కాలం లెఫ్ట్ పార్టీలకు ఓట్లేసిన హిందువుల్లో సగం మంది ఈసారి బీజేపీకి ఓటేస్తే 11 లోక్ సభ స్థానాల్లో కమలం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 25 శాతం మంది మాత్రమే ఓటేస్తే కేవలం4 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ఒడిశా ( లోక్ సభ సీట్లు 21 )

నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని బీజేపీ ఆశిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం మెరుగ్గా లేకపోవడంతో బీజేడీకి వ్యతిరేకంగా ఇంత కాలం కాం గ్రెస్ కు ఓటేస్తూ వస్తున్న ఓటర్లలో సగం మంది ఈసారి బీజేపీకి ఓటేస్తే 13 సీట్లు దక్కే అవకాశం ఉంది.