Judgment Day 2024 : ఫలితాలపై లైవ్ అప్డెట్స్

Judgment Day 2024 :  ఫలితాలపై లైవ్ అప్డెట్స్

దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ సీట్లలో గెలిచేది ఎవరు.. తెలంగాణ దంగల్ లో విజేతగా నిలిచేది ఎవరు.. ఏపీ ఫలితాల్లో సత్తా చాటేది ఎవరు.. మినిట్ టూ మినిట్ లైవ్ అప్ డేట్స్..

 

మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం:  మోదీ

  • ఇది ప్రజాస్వామ్య దేశంలోనే అతిపెద్ద విక్టరీ
  • ఈసీ ఎన్నికల ఘట్టాన్ని విజయవంతంగా పూర్తిచేసింది
  •  మూడోసారి ఎన్డీయే  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది
  • తెలంగాణలో మా  సీట్ల సంఖ్య పెరిగింది
  •  ఏపీలో చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్డీయేతోనే ఉన్నారు
  • ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం
  • ప్రజలు మాపై పూర్తి విశ్వాసాన్ని ఉంచారు
  • ఒటర్లకు రుణపడి ఉంటా
  • సబ్ కా సాాత్ సబ్ కా వికాస్ అనే మంత్రం పని చేసింది

 

ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు: పవన్ కళ్యాణ్

 

  • వైసీపీ నేతలు వ్యక్తిగత శత్రువులు కాదు
  • కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది
  •  ఇది కక్ష సాధింపు విజయం కాదు..కార్యకర్తలు గుర్తుంచుకోవాలి
  • సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమతో తొలి విజయం చూశాం
  • వైసీపీని భవిష్యత్ ను ఇబ్బంది పెట్టే విజయం కాదు
  • జీవితంలో నాకు ఇప్పటి వరకు విజయం తెల్వదు
  • 21కి21 గెలిచే వరకు విజయం ఇలా ఉంటుందని తీసుకొచ్చా
  • ఈ విజయం జనసేనది కాదు 5 కోట్ల మంది ప్రజలది
  • మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే  బాధ్యత తీసుకుంటాం
  • అన్నం పెట్టే రైతుకు అండగా ఉండే సమయం
  • ప్రజలు నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు
  • పోటీచేసినా అన్ని స్థానాల్లో గెలిచాం
  • నాకు రాజకీయాలకు డబ్బు అవసరం లేదు
  • ఏపీకి చీకటి రోజులు ముగిసిపోయాయి
  • యువత ఎంత నలిగిపోయారో నాకు తెలుసు
  • వ్యవస్థలో రాజకీయ ప్రమేయం తక్కువగా ఉండేలా చేస్తా
  • నాకు చిన్న విజయం కాదు..ఆకాశమంత ఉత్సాహం ఇచ్చారు

 

ఏపీ ఫలితాలు..ప్రెస్ మీట్లో  జగన్ భావోద్వేగం

  • ఈ ఫలితాలు ఆశ్యర్యంగా ఉన్నాయి
  •  ఇలాంటి ఫలితాలు వస్తాయని ఊహించలేదు
  •  ఇంటికే సంక్షేమ పథకాలు అందించినా ఏమైందో తెల్వదు
  • మహిళలకు సంక్షేమ పథకాలు అందించాం..వారి ఓట్లు ఏమయ్యాయో తెల్వదు
  • మంచి చేసినా ఓటమి పాలయ్యాం
  •  కోటి 5 లక్షల అక్కాచెల్లెళ్ల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెల్వదు
  • అరకోటి మంది రైతుల ప్రేమ ఏమైందో తెల్వదు  
  • మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేశాం
  • 53 లక్షల మందికి అమ్మ ఒడి పథకం అందించాం
  • పెత్తాందార్లతో పోరాడి ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొచ్చాం
  • అన్ని వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం
  • ప్రజల కోసం మా పార్టీ ఎప్పుడూ పోరాడుతుంది
  • ఎన్ని కుట్రలు చేసినా మాకు 40 శాతం ఓటింగ్ ను తగ్గించలేకపోయారు
  • ప్రతిపక్షం కొత్త కాదు..పోరాటం కొత్తకాదు
  • మళ్లీ పైకి వస్తాం..ఎన్నికష్టాలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధం
     

కూటమి నేతలో మాట్లాడి భవిష్యత్ నిర్ణయం: రాహుల్

  • టీడీపీ,జేడీయూ మద్దతుపై కూటమితో చర్చిస్తాం
  • రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు కష్టపడ్డారు
  • ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
  • రాజ్యాంగ వ్యవస్థలను  భ్రష్టు పట్టించింది
  • పార్టీలను విడదీశారు.. సీఎంలను జైల్లో వేశారు
  • మోదీకి సీట్లు వస్తున్నాయంటే స్టాక్ మార్కెట్లు పడిపోతాయా?
  • మేం ఇచ్చిన హామీల అమలకు కట్టుబడి ఉన్నాం
  •  మోదీ, ఆదానీ మధ్య ఉన్నది అవినీతి సంబంధం
  • రాజ్యాంగాన్ని కాపాడుకున్నది సామాన్య ప్రజలే
  • ఎన్నికల్లో నైతిక విజయం ఇండియా కూటమిదే
  • రేపు మా కూటమి నేతలతో మాట్లాడి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటాం

కేంద్రం ప్రభుత్వ ఏర్పాటులో  చంద్రబాబు, నితీశ్ కుమార్ కీలకంగా మారనున్నారు. ఎందుకంటే  కేంద్రంలోప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 543 స్థానాలకు గానూ మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలు కావాలి. ఏ పార్టీకి  మ్యాజిక్ ఫిగర్ రాలేదు. టీడీపీ 16, జేడీయూ 14 స్థానాల్లో  ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో చంద్రబాబు, నితీశ్ వైపు ఎన్టీయే, ఇండియా కూటమి చూస్తోంది. సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమవుతున్నాయి. 

ఇది మోదీ వ్యతిరేక తీర్పు: ఖర్గే

  •  రాహుల్ యాత్రలు కాంగ్రెస్ కు ప్లస్ అయ్యాయి
  • నైతికంగా మోదీకి ఇది ఓటమే
  • ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్ పోరాటం చేసింది
  • ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు
  • మోదీ వర్సెస్ ప్రజలు అన్న మాదిరి ఎన్నికలు జరిగాయి
  • ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు
  •  ఇది మోదీ వ్యతిరేక తీర్పు అని మేం భావిస్తున్నాం
  • ప్రజాతీర్పును  గౌరవిస్తున్నాం
  • కోట్లాది మంది కార్యకర్తలకు నా కృతజ్ఞతలు
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పోరాటం చేస్తూనే ఉంటాం

దేశ వ్యాప్తంగా ఎన్డీయూ కూటమి 294 స్థానాల్లో..ఇండియా కూటమి 232, ఇతరులు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

 ఏపీలో టీడీపీ 136, జనసేన21,బీజేపీ 8,వైసీపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 

లోక్ సభ ఎన్నికల ఫలితాలు నిరుత్సాహ పరిచాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. బూడిద నుంచి బయటకు వచ్చే ఫినిక్స్ పక్షిలా తిరిగి పూర్వ వైభవం సాధిస్తామన్నారు. 

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి  శంకర్‌ లల్వానీ చరిత్ర సృష్టించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండౌర్‌  నుంచి ఆయన ఏకంగా 10లక్షల 8 వేల 77 ఓట్ల మెజార్టీతో విక్టరీ సాధించారు.

యూపీలోని అమేథీలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్‌ శర్మ 1.5లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు

యూపీలోని వారణాసిలో ప్రధాని మోదీ మూడోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌పై 1,52,513 ఓట్ల తేడాతో  గెలిచారు.

  • పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ విజయం
  • నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి  5లక్షల51వేల ఓట్లతో విజయం
  • హైదరాబాద్  ఎంపీగా ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ గెలుపు
  • ఆదిలాబాల్ లో బీజేపీ అభ్యర్థి గోడం నగేష్ విజయం
  • ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రాఘురాంరెడ్డి విజయం
  • వరంగల్ లో  కాంగ్రెస్ అభ్యర్థి  కడియం కావ్య విజయం
  • నాగర్ కర్నూలులో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విజయం
  • మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ విజయం
  • జహిరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ విక్టరీ
  • కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం
  • నిజామాబాద్ లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విజయం
  • చేవేళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం

పవన్ కళ్యాణ్ కు  చిరంజీవి,అల్లు అర్జున్ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు

పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు లక్షా 25 వేల ఓట్ల లీడ్

ఖమ్మంలో  కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి  నాలుగున్నర లక్షల ఓట్ల ఆధిక్యం

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి 5లక్షల 50 వేల ఆధిక్యం

మెదక్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 37 వేల ఓట్ల లీడ్

కంటోన్మెంట్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 13 వేల మెజారిటీతో విజయం 

  • పెద్దపల్లిలో తనకు  భారీ ఆధిక్యం రావడంలో కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యేలకు, పార్టీ కార్యకర్తలకు  కృతజ్ఞతలు తెలిపిన గడ్డం వంశీకృష్ణ
  • పెద్దపల్లి ప్రజలకు సేవ చేసేందుకు ఎప్పుడూ ముందుంటానని వెల్లడి
  • మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి రెండున్నర లక్షలకు పైగా లీడ్
  • మహబూబ్ నగర్ లో 13వ రౌండ్ ముగిసే సరికి డీకే అరుణకు 13 వేల లీడ్
  • మెదక్ లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 30 వేలకు పైగా ఆధిక్యం
  • కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు  లక్షా50 వేలకు పైగా ఆధిక్ం
  • భువనగిరిగిలో కాంగ్రెస్ అభ్యర్థికి లక్షా 70 వేల ఆధిక్యం
  • చేవేళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 90 వేల ఆధిక్యం
  • నాగర్ కర్నూల్ లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవికి 40 వూలరే సౌగా ఆధిక్యం
  • పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు లక్షా 2 వేల అధిక్యం
  •  చంద్రుబాబుకు నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సందర్భంగా శుభాకాంక్షలు
  • నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థికి 5 లక్షలకు పైగా లీడ్
  • ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డికి 4 లక్షలకు పైగా అధిక్యం

ఆంధ్రప్రదేశ్: కాసేపట్లో సీఎం పదవికి జగన్ రాజీనామా, గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన జగన్. కాసేపట్లో రాజ్ భవన్ కు చేరనున్న జగన్. 

  • మహబూబ్ నగర్, మెదక్ లో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ
  • మెదక్ లో మూడోస్థానానికి పడిపోయిన బీఆర్ఎస్
  • పశ్చిమ బెంగాల్ లో దూసుకుపోతున్నతృణమూల్ కాంగ్రెస్
  •  బీహార్ లో  బీజేపీ, జేడీఎస్ కూటమి హవా..
     
  • పశ్చిమ బెంగాల్ లో దూసుకుపోతున్నతృణమూల్ కాంగ్రెస్
  • నార్త్ లో  బీజేపీకి షాక్.. సౌత్  లో ఊహించిన దానికన్నా ఎక్కువ సీట్లు. ఏపీలో 6, తెలంగాణలో 8 స్థానాల్లో ముందంజ

తెలంగాణ: పెద్దపల్లి సెగ్మెంట్లో 8వ రౌండ్ పూర్తయ్యేసరికి 48 వేల 18 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ

తెలంగాణ: బర్రెలక్క కంటే నోటాకే ఎక్కువ ఓట్లు .. నోటాకు 1500, బర్రెలక్కకు 1032 ఓట్లు

ఆంధ్రప్రదేశ్: బోణీ కొట్టిన టీడీపీ.. 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన గొరంట్ల బుచ్చయ్య చౌదరి. 

  • కేఏ పాల్ కు గాజువాకలో 394 ఓట్లు...  విశాఖలో  1190 ఓట్లు

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో 5 వేల ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్

  • లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదురుకుంటున్న ప్రజ్వల్ రేవణ్ణ లీడింగ్
  • కర్నాటకలో బీజేపీ 9 స్థానాల్లో ఆధిక్యం
  • మధ్యప్రదేశ్ లో బీజేపీ హవా..  అన్ని స్థానాల్లో ముందంజ
  • రాజస్థాన్ లో ఎన్డీఏ, ఇండియ కూటమి మధ్య పోటాపోటీ
  • యూపీలో బీజేపీకి షాక్.. ఆధిక్యంలో ఇండియా కూటమి

తెలంగాణ:

  • మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ కు 62వేల ఆధిక్యం
  • కరీంనగర్  లో బండిసంజయ్ కి 63వేల ఆధిక్యం
  • నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ ముందంజ
  • ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థికి 44వేల ఆధిక్యం
  • మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 10 వేల ఆధిక్యం
  • చేవెళ్ళలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డికి 30వేల లీడ్
  • సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డిముందంజ
  • హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు ఆధిక్యం

తెలంగాణ:

  • భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి48వేల ఆధిక్యం
  • మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 33వేల ఆధిక్యం
  • ఖమ్మంలో ఆరో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి లక్షా 25వేల ఆధిక్యం
  • జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థికి 11వేల ఆధిక్యం
  • పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 31వేల 167 ఆధిక్యం
  • నాగర్ కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవికి 7 వేల ఆధిక్యం
  • నల్గొండలో  కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం
  • వరంగల్ లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజ
 
  • వయనాడ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 80వేల ఓట్ల భారీ ఆధిక్యంలో కొనసాగుతుండగా.. రాయ్ బరేలిలో 34 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
  • మెదక్ లో 15 వందల 42 ఓట్లతో బీఆర్ఎస్ ముందంజ

ఆంధ్రప్రదేశ్:  ఏపీలో ఎన్డీఏ కూటమి 144 స్థానాల్లో ముందంజ. 21 స్థానాల్లో 18 స్థానాల్లో జనసేన ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్: పిఠాపురంలో 20వేల ఓట్ల ఆధిక్యంలో పవన్ కల్యాణ్ కొనసాగుతున్నారు. నగరిలో జనసేన ముందంజ.. మంత్రి రోజా వెనుకంజ

ఆంధ్రప్రదేశ్: 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన ముందంజ.. కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ

తెలంగాణ: 

  • మహబూబ్ నగర్ లో కాంగ్రెస్, బీజీపీ మధ్య హోరాహోరీ
  • లోక్ సభ ఎన్నికల కౌటింగ్ లో ఖాతా తెరిచిన బీఆర్ఎస్.. మెదక్ లో ముందంజ
  • వరంగల్ లో కడియం కావ్యకు 8 వేల లీడింగ్

యూపీ: వారణాసిలో ఆధిక్యంలోకి వచ్చిన ప్రధాని మోదీ

 

తెలంగాణ: పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో 5 వేల 94 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

యూపీ:  రాయ్ బరేలిలో 26వేల ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ

తెలంగాణ:

  • చేవేళ్ళలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి 14వేల ఆధిక్యం
  • కరీంనగర్ లో 15వేల అధిక్యంలో బండి సంజయ్
  • మల్కాజ్ గిరిలో ఈటల రాజేందర్ కు 18వేల లీడ్
  • ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థికి 46వేల లీడ్
  • నల్లగొండలో కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి

ఆంధ్రప్రదేశ్: చీపురుపల్లిలో మంత్రి బొత్స వెనుకంజ  

తెలంగాణ: సికింద్రాబాద్, కంటోన్మెంట్ లో కాంగ్రెస్ ముందంజ.. 855 ఓట్ల లీడింగ్ లో శ్రీగణేష్

ఆంధ్రప్రదేశ్:పెనుగొండలో మంత్రి ఉషశ్రీ చరణ్ వెనుకంజ 

తెలంగాణ: 9 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా.. బీజేపీ 7 స్థానాల్లో, ఎంఐఎం ఒక స్థానంలో ముందంజ ఉంది. 

కర్నాటక: మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై  ముందంజ

ఆంధ్రప్రదేశ్:

  • పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధిక్యం
  • మంగళగిరిలో నారా లోకేష్ , కుప్పంలో చంద్రబాబు ముందంజ
  • పులివెందులలో సీఎం జగన్ ఆధిక్యం.. వెనుకంజలో మంత్రులు

ఆంధ్రప్రదేశ్: గాజువాకలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్ నాథ్ వెనుకంజ 

ఆంధ్రప్రదేశ్: పుంగనూరులో వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజ 

యూపీ: అమేథీలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వెనకంజ ఉండగా.. వారాణాసిలో 5 వేల ఓట్ల నెనకంజలో ప్రధాని మోడీ ఉన్నారు

ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియా ముందంజ 

ఆంధ్రప్రదేశ్: సత్తెనపల్లిలో వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబు వెనుకంజ 

తెలంగాణ: మహబూబాబాద్, జహీరాబాద్, భువనగిరి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, చేవేళ్ల, కరీనంగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్,  మెదక్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక, హైదరాబాద్ లో అసదుద్దీన్ ఓవైసీ ముందంజ ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్: గన్నవరంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ వెనుకంజ

 తెలంగాణ:  కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటా పోటీ

ఢిల్లీ: 229 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యం

  • కేరళలో దూసుకెళ్తున్న ఇండియా కూటమి

యూపీ:  ఇండియా కూటమి, ఎన్డీఏ మధ్య పోటా పోటీ

ఆంధ్రప్రదేశ్: రాజంపేట ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ముందంజ 

కర్నాటక: మాండ్యాలో మాజీ సీఎం కుమార స్వామి ఆధిక్యం

ఆంధ్రప్రదేశ్: ఏపీలో ఇండియా కూటమి అభ్యర్థులు  ముందంజ. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఆధిక్యం

తెలంగాణ: పెద్దపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆధిక్యం

  • నిజామాబాద్ లో ధర్మపురి అర్వింద్ ముందంజ
  • నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఆధిక్యం
  • మెదక్ లో బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు ఆధిక్యం
  • భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి ముందంజ

ఆంధ్రప్రదేశ్: తిరుపతి అసెంబ్లీ స్థానంలో జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాస్ ముందంజ 

మహరాష్ట్ర: అమరావతిలో బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ ఆధిక్యం

ముంబై నార్త్ లో మంత్రి పియూష్ గోయల్ ముందుంజ

ఛత్తీష్ ఘడ్:మాజీ సీఎం భూపేష్ బఘేల్ ఆధిక్యం

 

ఆంధ్రప్రదేశ్: నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ ముందంజ 

రాజస్థాన్: కోటా నియోజకవర్గంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ముందంజ

 తెలంగాణ: ఖమ్మం కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు

  • హైదరాబాద్ లో అసదుద్దీన్ ఆధిక్యం
  • భువనగిరిలో బీజేపీ ఆధిక్యం
  • సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి ముందంజ
  • వరంగల్ లో కడియం కావ్య ముందంజ

ఆంధ్రప్రదేశ్: కడపలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ముందంజ 

ఆంధ్రప్రదేశ్: మైదుకూరులో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ముందంజ 

ఆంధ్రప్రదేశ్: నగిరిలో వైసీపీ అభ్యర్థి రోజా వెనుకంజ 

ఆంధ్రప్రదేశ్: రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముందంజ 
 

ఆంధ్రప్రదేశ్: కుప్పంలో చంద్రబాబు ముందంజ 
 

ఆంధ్రప్రదేశ్: పిఠాపురంలో వెయ్యి ఓట్లతో పవన్ కళ్యాణ్ ముందంజ..

తెలంగాణ: పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ముందంజ 
 

కేరళ: తిరువనంతపురంలో కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ ఆధిక్యం

తెలంగాణ: 

  • ఖమ్మంలో కాంగ్రెస్ ఆధిక్యం.
  •  కరీంనగర్ లో బండి సంజయ్ ముందంజ
  • మహబూబ్ నగర్ లో డీకే ఆరుణ ఆధిక్యం
  • ఆదిలాబాద్లో బీజేపీ ఆధిక్యం
  • మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ ఆధిక్యం

ఏపీ: రాజమండ్రి రూరల్ లో టీడీపీ లీడ్

హైదరాబాద్ :  చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పూజలు

ఏపీ: అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.కుప్పంలో చంద్రబాబు లీడింగ్ 1549 ఓట్లతో చంద్రబాబు ఆధిక్యం

రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి  బుచ్చయ్య చౌదరి ముందంజ. ఫస్ట్ రౌండ్ లో 910 ఓట్లలో  బుచ్చయ్య చౌదరి లీడింగ్.

యూపీ: మాయాపురిలో సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఆధిక్యం

ఢిల్లీ: దేశ రాజధాని నగరంలో ఏడు సీట్లలో బీజేపీ లీడింగ్

 యూపీ: అమేథీలో స్మృతి ఇరానీ ముందంజ

  • మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్ బెనర్జీ లీడింగ్
  • నాగ్ పూర్ లో నితిన్ గడ్కరీ లీడింగ్
  • మండిలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ఆధిక్యం
  • రాయబరేలిలో రాహుల్ గాంధీ ఆధిక్యం
  • లక్నోలో బీజేపీ అభ్యర్థి రాజ్ నాథ్ సింగ్ ముందంజ
  • వయనాడ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముందంజ
  • కోయంబతూర్ లో బీజేపీ లీడింగ్ 
  • గుజరాత్ లోని ఆనంద్ సెగ్మెంట్ లో బీజేపీ ఆధిక్యం

లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత పెట్టారు. కేంద్రబలగాలు, స్థానిక పోలీసులు, ఆర్మ్ డ్ రిజర్వడ్ పోలీసులు డ్యూటీలో ఉన్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ఐదుగురికి మించిన గుమికూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

దేశవ్యాప్తంగా  లోక్  సభ ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్  ప్రారంభం కాగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.  ఆ తరువాత అంటే 8.30 గంటల నుంచి ఈవీఎంలను లెక్కిస్తారు.  కౌటింగ్ కేంద్రాల దగ్గర సెక్షన్ 144 విధించారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటుగా ఏపీ, ఒడిశా  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. తెలంగాణలోనూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.  కాగా, ఇప్పటికే గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకుని బీజేపీ ఖాతా తెరిచింది.

ఆంధ్రప్రదేశ్ :   చిలకలూరిపేట కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ కి గుండెపోటు, అంబులెన్స్ లో హాస్పిటల్ కి తరలింపు 

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌటింగ్ కు సర్వం సిద్ధం.

 గుజరాత్  :  

  • సూరత్లో బీజేపీ ఏకగ్రీవం 
  • లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందే ఖాతా తెరిచిన బీజేపీ.
  •  గుజరాత్ లోని సూరత్ లోక్ సభ స్థానాన్ని ఏకగ్రీంగా గెలుచుకున్న బీజేపీ
  • కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

హైదరాబాద్ : దేశం మొత్తం లోక్ సభ ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. బీజేపీకి 400 సీట్లు వస్తాయి. :  హైదరాబాద్‌ బీజేపీ  ఎంపీ అభ్యర్థి మాధవి లత 

 

ఆంధ్రప్రదేశ్:

  • ఏపీ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి.
  • 175 అసెంబ్లీ స్ధానాలకు 2,387 మంది పోటీ.
  • 25 లోక్ సభ స్ధానాలకు 454 మంది అభ్యర్ధులు పోటీ.

మహబూబాబాద్ జిల్లా :   మహబూబాబాద్ పార్లమెంట్ కౌటింగ్ కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ ఎంపీ ఆభ్యర్ధి పోరిక బలరాం నాయక్

తెలంగాణ : 

  •  కాసేపట్లో లోక్ సభ ఓట్ల లెక్కింపు 
  • తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో ఓట్ల లెక్కింపు 
  • 17 నియోజకవర్గాలలో 525 మంది పోటీ
  • ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం
  • కౌంటింగ్  కేంద్రాల దగ్గర 15 వేల మందితో భద్రత
  • సీసీ కెమెరాలతో నిఘా 
  • ఫలితాలపై బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్షన్

 

  •  పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికల సిబ్బంది, ఏజెంట్స్ హడావిడి మొదలైంది.
  • కౌంటింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలు, బ్యాలెట్ బాక్సులు