
హైదరాబాద్ : కాంగ్రెస్, టీడీపీ పాలనలో తెలంగాణ చాలా నష్టపోయిందన్నారు BSP అధినేత్రి మాయావతి. గురువారం హైదరాబాద్ లోని ఎల్బీస్టేడియంలో జరిగిన జనసేన-BSP బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. “ బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం ఏం చేసింది. వెనుకబడిన వర్గాలకు లాభం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆంధ్రా పాలకుల నుంచి విముక్తి కోసం తెలంగాణ ఉద్యమం నడిచింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను ఈ ప్రభుత్వ నెరవేర్చలేదు. 70శాతం ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. 2 శాతం కూడా లేని సామాజిక వర్గం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం అవుతారు. అని ప్రశ్నించారు మాయావతి.