హైదరాబాద్‌‌లో లండన్ స్టాక్ ఎక్స్ చేంజ్ టెక్ సెంటర్‌‌

హైదరాబాద్‌‌లో లండన్ స్టాక్ ఎక్స్ చేంజ్ టెక్ సెంటర్‌‌

హైదరాబాద్‌‌లో లండన్ స్టాక్ ఎక్స్ చేంజ్ టెక్ సెంటర్‌‌
వెల్లడించిన మంత్రి కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు :  లండన్ స్టాక్ ఎక్స్ చేంజ్ గ్రూప్ (ఎల్ఎస్ఈజీ) హైదరాబాద్‌‌లో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌ను ఏర్పాటు చేయనుంది. మంత్రి కేటీఆర్​ యూకే పర్యటనలో భాగంగా శుక్రవారం ఎల్ఎస్ఈజీ సీఐవో(చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్) ఆంటోనీ మెక్‌‌కార్తీతో సమావేశం అయ్యారు. అనంతరం సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రి ట్వీట్ చేశారు.

హైదరాబాద్​లో ఎల్ఎస్ఈజీ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌‌ ఏర్పాటుతో  వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. అంతేగాక, రాష్ట్రంలోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగానికి పెద్ద బూస్ట్ లభిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర సర్కార్, ఎల్‌‌ఎస్‌‌ఈజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వివరించారు. కార్యక్రమంలో ఇండస్ట్రీస్​ప్రిన్సిపల్​సెక్రటరీ జయేశ్​రంజన్, ఎన్ఆర్ఐ అఫైర్స్​ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్​రెడ్డి పాల్గొన్నారు.