లండన్ ఆగమాగం..ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టు మూసివేత..ఎంజరిగింది?

లండన్ ఆగమాగం..ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్పోర్టు మూసివేత..ఎంజరిగింది?

ఆకస్మాత్తుగా పేలిన సబ్స్టేషన్.. భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. గంటల కొద్దీ శ్రమిస్తేగానీ మంటలు అదుపులోకి రాలేదు. సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ ప్రాంతమంతా అంధకారమయింది. ఎయిర్ పోర్టు మొత్తం చీకట్లు కమ్ముకున్నాయి. దీంతో ప్రయాణికులు పరుగులు పెట్టారు.  ఏం జరిగిందో తెలియక ఆందోళన చెందారు. శుక్రవారం ( మార్చి 21) అర్థరాత్రి నుంచి దాదాపు పది గంటలపాటు లండన్ లోని హీత్రో విమానాశ్రయంలో ఇది పరిస్థితి.  

శుక్రవారం అర్థరాత్రి సమయంలో హీత్రో ఎయిర్ పోర్టులోని ఓ విద్యుత్ బస్ స్టేషన్ ఒక్కసారిగా మంటలంటుకొని పేలిపోయింది. దీంతో ఎయిర్ పోర్టు మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.దీంతో యూరప్‌లో అత్యంత రద్దీగా ఉండే బ్రిటన్‌లోని హీత్రూ విమానాశ్రయం మూసివేశారు అధికారులు. దాదాపు లక్ష ఇళ్లకు విద్యుత్ అంతరాయం ప్రభావం చూపింది. దాదాపు 4వేల ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. 

ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. హీత్రోకు వచ్చి పోయే దాదాపు 1,350 విమానాలు ప్రభావితమయ్యాయి. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని తిరిగి షెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం మరికొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది. ఎయిర్ పోర్టు మూసేసిన సమయంలో దాదాపు 120 విమానాలు గగనతలంలో ఉన్నాయి. కొన్నింటిని వెనక్కి తిప్పాల్సి మళ్లించారు. మరికొన్నింటిని లండన్ సమీపంలోని గాట్విక్, పారిస్‌లోని చార్లెస్ డి గల్లె ,ఐర్లాండ్‌లోని షానన్ ఎయిర్ పోర్టులకు మళ్లించారు. 

ఏం జరిగిందంటే.. 

బ్రిటన్‌లోని హీత్రూ ఎయిర్ పోర్టులోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఎయిర్ పోర్టుకు మొత్తం విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో శుక్రవారం(మార్చి21)  తెల్లవారుజామున యూరప్ అత్యంత బిజీగా ఉండే హీత్రో ఎయిర్ పోర్టును మూసివేశారు.  

ALSO READ | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా శాఖ మూసివేత.. ఉత్తర్వులపై సంతకం చేసిన ట్రంప్

పశ్చిమ లండన్‌లోని హేస్‌లో రాత్రి 11:23 గంటలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న లండన్ అగ్నిమాపక దళం 10 ఫైరింజన్లు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండటంతో సమీప ప్రాంతంలోని స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్ని మాపక సిబ్బంది రాత్రంగా అవిశ్రాంతంగా పనిచేయడంతో ఉదయం 8 గంటలకు మంటలు అదుపుతోకి వచ్చాయని అధికారులు తెలిపారు.